https://oktelugu.com/

Best Mileage Cars: ఎక్కువ మైలేజ్ ఇచ్చే తక్కువ ధర కార్లు ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి..

హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్ యూవీలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది 19.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 30, 2023 / 04:47 PM IST

    Best Mileage Cars

    Follow us on

    Best Mileage Cars: నేటి కాలంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా ఓన్ వెహికల్ ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కార్ల కంపెనీలు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ మోడళ్లను తయారు చేస్తున్నాయి. మారుతి సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు తక్కువ ధర కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే విధంగా ఉత్పత్తి చేశారు. చేశాయి. ఈ మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకుందామా..

    హ్యుందాయ్ ఎక్స్ టర్:
    హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్ యూవీలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది 19.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. సీఎన్ జీ వేరియంట్ లో 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. 5 సీటింగ్ కెపాసిటీని కలిగి 8 ఇంచెస్ హెచ్ డీ టచ్ స్క్రీన్, ఎక్స్ టర్ పార్కింగ్ డిస్టన్ష్ తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎస్ యూవీ సెగ్మెంట్లలో ఇప్పటి వరకు టాటా పంచ్, సిట్రోయెస్ సీ 3 కార్లు మాత్రమే ఉండగా వాటికి పోటీ ఇస్తూ ఎక్స్ టర్ ఆకట్టుకుంటోంది. ఈ కారు ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.10 లక్షల వరకు పలుకుతోంది.

    మారుతి ప్రెస్సో:
    దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కంపెనీ నుంచి వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మారుతి ఎస్-ప్రెస్సో ఆకట్టుకుంటోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 998 సీసీ త్రి సిలిండర్, 68 బీహెచ్ పీ పవర్, 90 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు స్మార్ట్ ప్లే స్టూడియోకు అంతర్నిర్మితంగా అందిస్తుంది. ఈ కారు లీటర్ కు 25 కిలోమీటర్ల వరకు మేలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6 లక్షల కంటే తక్కువ ధరకే పొందవచ్చు.

    టాటా టియాగో:
    టాటా కంపెనీ నుంచి అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో టియాగో ఒకటి. 1199 సీసీ ఇంజన్ ను కలిగి ఉన్న ఈ కారు లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 26 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ.8 లక్షలతో విక్రయిస్తున్నారు.