https://oktelugu.com/

Lost Cell Phone: సెల్ ఫోన్ పోయిందా? భయం అక్కర్లేదు.. ఇలా చేస్తే ఇంటికే తిరిగి వస్తుంది..

ఇటీవల పోలీస్ స్టేషన్లలో ఫోన్ బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అందుకు కారణమేంటంటే వారు పోగొట్టుకున్న మొబైల్ వెంటనే తిరిగి వస్తుందనే నమ్మకం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 11, 2023 6:16 pm

    Lost Cell Phone

    Follow us on

    Lost Cell Phone: మొన్నటి వరకు మొబైల్ పోయిందంటే ఆశలు వదులుకున్న వాళ్లు ఎందరో. కొందరు కాస్ట్లీ ఫోన్ వినియోగదారులు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్లు. అయితే పోలీసుల రికవరీకి ఇది చాలా సమయం పట్టేది. దీంతో వీరి గురించి తెలిసిన వాళ్లు ఇంకొందరు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం మానేశారు. దీంతో చాలా మంది ఫోన్ ను దొంగలించిన వాళ్లు హాయిగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొబైల్ పోయిన 24 గంటల్లో తిరిగి వస్తుంది. పోలీసులు ఉపయోగిస్తున్న ఓ టెక్నాలజీ అండ్ చిన్న ఐడియా ద్వారా పోయిన ఫోన్ వెంటనే దొరికిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

    ఇటీవల పోలీస్ స్టేషన్లలో ఫోన్ బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అందుకు కారణమేంటంటే వారు పోగొట్టుకున్న మొబైల్ వెంటనే తిరిగి వస్తుందనే నమ్మకం. పోలీసులు సైతం ఫోన్ల చోరీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా మొబైల్ ఫిర్యాదు రాగానే వెంటనే టెక్నాలజీని ఉపయోగించి దానిని కనుక్కొంటున్నారు. అయితే మొబైల్ మిస్ అయిన వారు ముందుగా కంప్లైంట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ముందు మీ సేవ కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

    మీసేవ కార్యాలయంలో మొబైల్ కు సంబంధించిన వివరాలను ఇచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ను తీసుకొని ఆ మొబైల్ ఉన్న సిమ్ బ్లాక్ చేసేందుకు షో రూంకు వెళ్లాలి. మీ కంప్లైంట్ ను తీసుకున్న తరువాత వారు మీ నెంబర్ సిమ్ బ్లాక్ చేస్తారు. ఫోన్ మాత్రం పనిచేస్తుంది. ఆ తరువాత సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్ సైట్ లో బ్లాక్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పోగొట్టుకున్న ఫోన్ కు సంబంధించిన కొన్ని నెంబర్లు, ఈఎంఐ నెంబర్ ను నమోదు చేయాలి. ఇలా ఫోన్ వివరాలను ఎంట్రీ చేసిన తరువాత మీ కొత్త సిమ్ కు రిక్వెస్ట్ ఐడీ వస్తుంది.

    ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ ఐడీ వివరాలతో ఫిర్యాదు ఇవ్వాలి. పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకున్న తరువాత ముందుగా ఫోన్ ను కనుక్కునే పనిలో పడుతారు. ఇలా పోగొట్టుకున్న మొబైల్ లో దొంగిలించిన వ్యక్తి ఎలాగూ కొత్త సిమ్ కార్డు వేస్తాడు. ఇది వేయగానే వెంటనే బాధితుడితో పాటు పోలీసులకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఆధారంగా ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇలా పోలీసులు దొంగిలించిన వ్యక్తులకు ఫోన్ చేసి ఫోన్ ఇవ్వాలని కోరుతారు. లేకుండే కేసు ఫైల్ చేస్తామని చెప్పడంతో వెంటనే వాళ్లు ఫోన్ ను తిరిగి ఇచ్చేస్తున్నారు.

    ఇలా గడిచిన మూడు నెలల్లో 7000లకు పైగా మొబైల్స్ రికవరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొత్త విధానం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే మీరు ఏ ఫోన్ కొనుగోలు చేసినా దానికి సంబంధించిన బిల్ లేదా ఈఎంఐ నెంబర్ ను ముందుగానే నమోదు చేసుకోండి. అలాగే దురదృష్టవశాత్తూ ఫోన్ దొంగిలించబడితే ఈ నెంబరే మీకు ఆధారంగా పనిచేస్తుంది. ఇది లేకపోవడం వల్ల సీఈఐఆర్ పోర్టల్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉండదు.