Moong Dal: ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల చాలా మంది ఈరోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం మంది ముఖ్యంగా కొవ్వు, కాలేయం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. తీసుకునే ఆహారం, అలవాట్లు, వ్యాయామం వంటి వాటి వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోకపోవడం వల్ల గుండె ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాంటే ఆహార విషయంలో నియమాలు తప్పకుండా పాటించాలి. ఇలా పాటించపోవడం వల్ల ఈ రోజుల్లో కొందరు కాలేయ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవాలంటే మందులు వాడటం ఎంత ముఖ్యమో.. ఆహార విషయంలో నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. తప్పకుండా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. అయితే కాలేయ సమస్యలను తగ్గించుకోవాలంటే ఆహారంలో ఈ పదార్థాన్ని తప్పకుండా యాడ్ చేయాలి. మరి యాడ్ చేయాల్సిన ఆ పదార్థం ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
కాలేయ సమస్యలు రాకుండా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ లైఫ్‌లో పప్పును పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. ఈ పప్పును తినడం వల్ల సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే పెసరపప్పును వండి తీసుకోవడం కంటే దాని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున పెసరపప్పు వాటర్‌ను తాగడం వల్ల కడుపు క్లియర్ అవుతుంది. లోపల ఉన్న చెడు వ్యర్థాలు బయటకు వస్తాయి. అలాగే కొవ్వు తగ్గడంతో పాటు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. డైలీ ఉదయం ఈ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. ఈ పప్పు నీరు తాగడం వల్ల మూత్రాశయం, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది బాడీని హైడ్రేట్ చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది.
పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు బి ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. అలాగే మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా పెసర పప్పు బాగా ఉపయోగపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇందులో తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటివి రాకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, యంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు యవ్వనంగా ఉండేలా సాయపడుతుంది. అలాగే ఇందులో ప్రొటీన్, ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. డైట్‌లో పెసర పప్పును మీకు నచ్చిన విధంగా తినడం వల్ల తప్పకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.