Live Longer: ప్రస్తుతం రోజుల్లో 50 ఏళ్ల కంటే జీవించడం అంటే కష్టమే. ఎందుకంటే మారిన జీవనశైలి వల్ల చాలా మంది తొందరగా మరణిస్తున్నారు. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ జనరేషన్‌లో ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు. పూర్వం రోజుల్లో అయితే దాదాపుగా 80 ఏళ్ల వరకు అయిన మనుషులు జీవించేవారు. కానీ ప్రస్తుతం 50 ఏళ్లు జీవించడం కూడా కష్టమే. ఒక వేళ జీవించిన కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతా కూడా మందులతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా వందేళ్ల పాటు కొన్ని రకాల పదార్థాలను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గింజలు
ఆరోగ్యంగా జీవించాలంటే తప్పకుండా డైట్‌లో బీన్స్ ఉండాలి. వీటిని డైలీ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడతాని నిపుణులు చెబుతున్నారు. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే గింజలను తీసుకోవాలి. మార్కెట్లో రాజ్మా, బీన్స్ ఇలా రకరకాల గింజలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
తీసుకునే డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించేలా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
తాజా ఆకుకూరలు
ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలంటే తాజా ఆకు కూరలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులోని పోషకాలు ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయి. ముఖ్యంగా బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, తోటకూర, మెంతికూర వంటి తాజా ఆకు కూరలు, కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
చేపలు
చికెన్, మటన్ కంటే చేపలు ఎక్కువగా తినాలని నిపుణులు అంటున్నారు. చేపల్లోని పోషకాలు ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే సాల్మోన్ ఫిష్‌ను ఎక్కువగా తినాలి.
ఫైబర్ రిచ్ ఫుడ్స్
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ను తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ఆరోగ్యంగా యంగ్ లుక్‌లో ఉండాలంటే ప్రొటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంతో పాటు యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారు. మార్కెట్‌లో లభ్యమయ్యే రిఫైన్డ్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్‌ను వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు తొందరగా ముసలితనం రాదు. దీనివల్ల మీ వయస్సు పెరిగిన కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు.
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఫుడ్ ఒక్కటే తింటే సరిపోదు. వ్యాయామం కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.