https://oktelugu.com/

Lips: పెదవులు పగిలితే లైట్ తీసుకోవద్దు.. దేనికి కారణమో తెలుసా?

కారణం లేకుండా పెదవులు పగుళ్లు వస్తుంటే మాత్రం లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. మరి పెదవులు పగుళ్లు దేనికి సంకేతమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2024 / 12:15 AM IST

    lips

    Follow us on

    Lips: సాధారణంగా చలికాలంలో పెదవులు పగిలిపోతాయి. కానీ కొందరికి ఏ సీజన్‌లో అయిన కూడా పెదవులు పగిలిపోతుంటాయి. కాస్త వాతావరణం మారితే చాలు ఇక పెదవులు పగిలిపోతాయి. దీంతో పెదవులు చాలా మంటగా ఉంటాయి. ఏ పదార్థాన్ని అయిన తినలేరు. కాస్త కారం తిన్న చాలు మంటగా అనిపిస్తుంది. కొందరు ఎల్లప్పుడూ కూడా పెదవులకు లిప్‌బామ్ వాడుతుంటారు. అయిన కూడా పెదవుల సమస్య తగ్గదు. శరీరానికి సరిపడా ఆహారం తీసుకోకపోయిన కూడా కొందరి పెదవులు పగిలిపోతాయి. అయితే పెదవులు ఇలా ఎప్పుడూ పగుళ్లతో ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య విషయంలో తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆరోగ్యమైన ఫుడ్ కూడా తీసుకోరు. దీంతో విటమిన్లు బాడీకి అందక వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కారణం లేకుండా పెదవులు పగుళ్లు వస్తుంటే మాత్రం లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. మరి పెదవులు పగుళ్లు దేనికి సంకేతమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    కొందరు పోషకాలు ఉండే ఆహారం తీసుకోరు. ముఖ్యంగా విటమిన్లు ఉండే ఫుడ్ లేకపోవడం వల్ల పెదవులు పగుళ్లు చెందడం, రక్తస్రావం వంటివి అవుతాయి. కొందరిలో ఐరన్ లోపం వల్ల కూడా పెదవులు పగుళ్లు వస్తాయి. చలికాలంలో కాకుండా ఇంకా ఎప్పుడైనా పెదవులు ఇలా అయితే మాత్రం తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. విటమిన్ బీ 12, విటమిన్ సి లోపం ఉన్నవారిలో కూడా పెదవులు పగిలిపోతాయి. కాబట్టి ఈ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొందరిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న కూడా పెదవులు పగుళ్లు వస్తాయి. చలి వల్ల లేదా పెదవులను ఎల్లప్పుడూ నొక్కడం వల్ల కూడా వస్తాయి. కాబట్టి పెదవులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మాయిలు ఎక్కువగా నాణ్యత లేని లిప్‌స్టిక్‌లు వాడుతుంటారు. వీటివల్ల కూడా పెదవులు పగుళ్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సమయం పాటు లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

     

    సీజన్‌తో సంబంధం లేకుండా పెదవులు ఎక్కువగా పగుళ్లు వస్తుంటే డైట్‌లో విటమిన్ బి, ఐరన్, పోషకాలు ఉండే పదార్థాలను చేర్చుకోండి. ముఖ్యంగా సీజనల్ పండ్లు, నారింజ, కివీ, ద్రాక్ష, నిమ్మ, ద్రాక్ష పండ్లు, తాజా పండ్లు, టమోటా, బంగాళాదుంప, ఆకుకూరలు, క్యాప్సికమ్ వంటివి యాడ్ చేసుకోవాలి. అలాగే శరీరానికి సరిపడా నీరు తాగాలి. మార్కెట్లో దొరికే లిప్‌బామ్‌లు కాకుండా ఇంట్లోనే సహజంగా వీటిని తయారు చేసుకోండి. దీనివల్ల పెదవులు పగళ్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పెదవులు పగుళ్లు తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించడం ఆరోగ్యానికి మేలు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.