https://oktelugu.com/

Lips: పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ లోపం మీలో ఉన్నట్లే!

ఎన్ని చిట్కాలు పాటిస్తున్న కూడా పెదవులు పగుళ్లు వస్తుంటే మీలో ఏదో లోపం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి పెదవులు పగళ్లు రావడం వల్ల వచ్చే సమస్యలేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 14, 2024 10:38 pm
lips

lips

Follow us on

Lips: సాధారణంగా చలికాలంలో పెదవులు పగిలిపోతాయి. కానీ కొందరికి ఏ సీజన్‌లో అయిన కూడా పెదవులు పగిలిపోతుంటాయి. కాస్త వాతావరణం మారితే చాలు ఇక పెదవులు పగిలిపోతాయి. దీంతో పెదవులు చాలా మంటగా ఉంటాయి. ఏ పదార్థాన్ని అయిన తినలేరు. కాస్త కారం తిన్న చాలు మంటగా అనిపిస్తుంది. కొందరు ఎల్లప్పుడూ కూడా పెదవులకు లిప్‌బామ్ వాడుతుంటారు. అయిన కూడా పెదవుల సమస్య తగ్గదు. శరీరానికి సరిపడా ఆహారం తీసుకోకపోయిన కూడా కొందరి పెదవులు పగిలిపోతాయి. అయితే పెదవులు ఇలా ఎప్పుడూ పగుళ్లతో ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య విషయంలో తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆరోగ్యమైన ఫుడ్ కూడా తీసుకోరు. దీంతో విటమిన్లు బాడీకి అందక వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఎన్ని చిట్కాలు పాటిస్తున్న కూడా పెదవులు పగుళ్లు వస్తుంటే మీలో ఏదో లోపం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి పెదవులు పగళ్లు రావడం వల్ల వచ్చే సమస్యలేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా పెదవులు పగుళ్లు వస్తుంటే విటమిన్ లోపం తప్పకుండా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో పెదవులు పగుళ్లు వస్తే పర్లేదు. కానీ వేసవి కాలంలో కూడా పెదవులు పగుళ్లు వస్తే తప్పకుండా ఇదే కారణమని వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి2 లోపం వల్ల పెదవులు ఎక్కువగా పగుళ్లు వస్తాయి. ఈ విటమిన్ బాడీలో తక్కువగా ఉంటే పెదవులు పగిలిపోవడం, చర్మం పొడిబారడం, నోటిపూత వంటి సమస్యలు వస్తాయి. దీన్ని తగ్గించుకోవాలంటే ఆహారంలో మార్పులు చేయాలి. పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తులను తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ ఇలా అన్నింటిని తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ బి ఎక్కువగా అందుతుంది. వీటితో పాటు మాంసం, చేపలు, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు తృణధాన్యాలు కూడా ఎక్కువగా తినాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయట పడతారు.

 

విటమిన్ బి లోపం వల్ల పెదవులు ఎక్కువగా పగుళ్లు వస్తుంటాయి. దీంతో చర్మంలోని తేమ పోయి కొన్నిసార్లు మంట కూడా వస్తుంది. ఈ విటమిన్ శరీరంలో లేకపోతే కొన్నిసార్లు నిద్ర సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే జుట్టు ఎక్కువగా రాలడం, చిరాకు, మానసికంగా వేదన చెందడం వంటివి కూడా వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి పెదవులకు కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. లిప్‌బామ్‌లు వంటివి వాడుతుండాలి. పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు వంటివి పుష్కలంగా తీసుకోవాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.