https://oktelugu.com/

Lemon Water: చలికాలంలో నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి హానికరమా? ఇందులో నిజమెంత?

నిమ్మ నీటిని వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ చలికాలంలో ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 29, 2024 / 02:49 AM IST

    Lemon Water

    Follow us on

    Lemon Water: సాధారణంగా నిమ్మకాయ నీరును ఎక్కువగా వేసవిలో తాగుతుంటారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధికంగా ఈ నీటిని తీసుకుంటారు. ఎక్కువ శాతం మంది బరువు తగ్గడానికి ఈ నిమ్మకాయ నీరుని వాడుతారు. రోజూ ఉదయం పూట వేడి నీరు, తేనెలో కలిపి తాగుతుంటారు. ఇలా కలిపి తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. డైలీ నిమ్మకాయ నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉదయం పూట నిమ్మరసం తాగడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. రోజూ ఈ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నిమ్మకాయ నీరు శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఈ నీటిని వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ చలికాలంలో ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

     

    నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే చలికాలంలో నిమ్మ రసం తాగడం వల్ల జలుబు, దగ్గు వస్తాయని, ఈ సమయంలో తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందరూ అనుకుంటారు. కానీ చలికాలంలో కూడా నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్‌గా నిమ్మరసం తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి విముక్తి చెందుతారు. ఏ సీజన్‌లో అయిన కూడా నిమ్మ రసం ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చలికాలంలో ఉదయం పూట నిమ్మ రసం తాగేవారు బాగా చల్లనవి కాకుండా గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బాగా చల్లగా ఉండే నీటితో నిమ్మరసం తాగడం, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొన్నిసార్లు అనారోగ్య బారిన పడతారు. కాబట్టి కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగడం ఉత్తమం.

     

    రోజూ నిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. నిమ్మకాయలో తక్కువగా కేలరీలు ఉంటాయి. ఇవి బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే జీవక్రియ రేటును కూడా పెంచుతాయి. నిమ్మరసం తాగడం వల్ల తొందరగా ఆకలి వేయదు. శరీరంలో శక్తి ఉండటంతో పాటు బద్దకం కూడా తగ్గుతుంది. నిమ్మకాయ నీరు రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలన్ని తొలగిపోతాయి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలను తొలగించి అందంగా ఉండేలా చేస్తుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.