Lemon Leaves: శరీర ఆరోగ్యానికి నిమ్మకాయలు చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి. పూర్వం రోజుల్లో అయితే నిమ్మ చెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు రోజుల్లో అయితే ఎవరి ఇంటి దగ్గర ఉండేవి. వీటి వాసనకు కీటకాలు కూడా ఇంట్లోకి రావని నమ్ముతారు. కానీ ఈ రోజుల్లో అసలు ఎవరి ఇంట్లో కూడా నిమ్మ చెట్లు కనిపించవు. అయితే నిమ్మకాయను ఏ విధంగా ఉపయోగించిన శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు నిమ్మకాయ నీరు తాగితే మరికొందరు పచ్చళ్లు చేసుకోవడం, నిమ్మకాయ పులిహోర ఇలా రకరకాల వంటలు చేస్తారు. ఇందులోని సిట్రిక్ ఆమ్లం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అమ్మాయిలు ఎక్కువగా చర్మానికి, జుట్టుకి కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే కేవలం నిమ్మకాయలతో మాత్రమే కాకుండా నిమ్మ ఆకులతో కూడా ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా అవేంటో మరి తెలుసుకుందాం.
నిమ్మ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పాటు మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. రోజూ ఈ ఆకులను ఉదయం పూట తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రోజంతా నీరసంగా లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను బలంగా చేయడంలో సాయపడతాయి. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఈ ఆకులను తింటే సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఈ ఆకులు వాంతులు, వికారం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ప్రయాణాల్లో ఎక్కువగా ఎవరికి అయితే వాంతులు వస్తుంటాయో వారు నిమ్మ ఆకులను నమిలిన లేదా వాసన చూసిన వెంటనే తగ్గిపోతాయి. కొందరికి కడుపులో నులి పురుగులు అవుతుంటాయి. దీనివల్ల ఎక్కువగా కడుపు నొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి.
నిమ్మ ఆకులతో టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన టీని రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట తాగడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా నిమ్మ ఆకుల టీ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మ ఆకుల టీని రోజూ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి బెల్లీ ఫ్యాట్ అయిన సరే కరిగిపోతుంది. ఉదయం పూట తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా ఎనర్జీటిక్‌గా ఉంటారు. అయితే ఈ టీను పరగడుపున తాగడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.