Left Hand: సాధారణంగా ఎక్కువ శాతం మంది కుడి చేతి వాటం కలిగి ఉంటారు. కొందరు మాత్రం ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. అయితే కుడి చేతి వాటం కంటే ఎడమ చేతి వాటం ఉన్నవారు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడతారని ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారట. అయితే ఎడమ చేతి వాటం ఉన్నవారికి ఎక్కువగా గుండె ప్రమాదాల వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. కుడి చేతి వాటం ఉన్న వ్యక్తులకు అంతగా వ్యాధులు సోకవని.. కానీ వీరితో పోలిస్తే ఎడం చేతి వాటం ఉన్నవారు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారు. అయితే ఎందుకు వీరు ప్రమాదాల బారిన పడతారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. జన్యుపరమైన సమస్యలు అయి ఉండవచ్చని పరిశోధకులు సందేహపడుతున్నారు. అయితే ఎడమ చేతి వాటం ఉన్నవారికి ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
నరాల వ్యాధులు
కుడిచేతి వాటం వారితో పోలిస్తే ఎడమచేతి వాటం వారు ఎక్కువగా నరాల వ్యాధుల బారిన పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. డైస్లెక్సియాతో బాధపడుతున్న కొందరు పిల్లలపై పరిశోధనలు చేశారు. దీంతో ఆ పిల్లలలో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఉన్నట్లు తేలింది.
రొమ్ము క్యాన్సర్ ప్రమాదం
రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుంది. అయితే కూడి చేతి వాటం ఉన్న మహిళల కంటే ఎడమ చేతి వాటం ఉన్నవారికి ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఎక్కువగా ఈస్ట్రోజెన్ విడుదల అవుతుంది. దీనివల్ల ఎడమచేతి వాటం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో ఎడమ చేతి వాటం వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
స్కిజోఫ్రెనియా అనే తీవ్ర్రమైన మానసిక వ్యాధి
ఒత్తిడి, ఆందోళన వల్ల మానసిక సమస్యలు వస్తాయి. కానీ ఎడమ చేతి వాటం ఉంటే స్కిజోఫ్రెనియా అనే ఒక తీవ్రమైన మానసిక వ్యాధి వస్తుందట. దీనిపై ఎన్నిసార్లు పరిశోధనలు జరిగిన కూడా ఇదే తేలింది. ఈ స్కిజోఫ్రెనియా ఎక్కువగా ఎడమచేతి వాటం వారిలోనే కనిపిస్తుంది. కొందరు భ్రాంతులు, భ్రమలు, ఎక్కువగా అసాధారణ ఆలోచనగా ఉంటారు. ఈ సమస్య వస్తే తగ్గించుకోవడం కాస్త కష్టం. కాబట్టి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
గుండె పోటు ప్రమాదాలు
ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తుల్లో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. మొత్తం 379ని ఎంచుకుని వారిపై పరిశోధనలు చేయగా.. కుడిచేతితో కంటే ఎడమ చేతి వాటం ఉన్నవారు 9 ఏళ్లు ముందు చనిపోతున్నట్లు తేలింది.
మానసిక సమస్యలు
ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు తొందరగా మానసిక వ్యాధుల బారిన పడతారట. వీరిలో ఎక్కువగా మానసిక ఆవేదన, ఆందోళన, చిరాకు, భయం, విశ్రాంతి లేకపోవడం, ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ప్రతి విషయానికి కోపం పడుతుంటారట. కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఎడమ చేతి వాటం వారు ఎక్కువగా వ్యాధులు బారిన పడతారని పరిశోధనల్లో తేలింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.