Late Breakfast: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సమయపాలన కొద్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. చాలా మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది. క్రమం తప్పకుండా టిఫిన్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే మరికొంత మంది ఉదయం ఏం తినకుండా ఉంటారు. ఈ సమయంలో కేవలం టీ, కాఫీలు తీసుకొని మధ్యాహ్నం వరకు నేరుగా భోజనం చేస్తారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకున్నా.. ఎలాంటివి తీసుకోవాలి? ఏవీ తీసుకోవద్దు?
ఉదయం లేవగానే స్కూల్ కెళ్లేవారు, ఉద్యోగం, వ్యాపారం చేసేవారు బిజీ లైఫ్ తో గడుపుతారు. కాస్త నిద్ర ఆలస్యంగా లేస్తే సమయం గడిచిపోద్దనే ఉద్దేశంతో ఉదయం ఎలాంటివి తీసుకోకుండానే తమ విధుల్లోకి వెళ్తారు. రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోయే సమయంలో తిన్న ఆహరం పూర్తిగా డైజేషన్ అవుతుంది. ఉదయం శరీరం ఏదైనా పదార్థాన్ని కోరుతుంది.ఇటువంటి సమయంలో లైట్ గా ఏదైనా తీసుకోవడం చాలా మంచిది. అయితే టిఫిన్ చేయాలని కొందరు ఆయిల్ ఫుడ్ ను తీసుకుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు.
అయితే ఉదయం విధుల్లోకి వెళ్ల ముందు గింజలు వంటివి తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా కావాల్సినంత ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఈమధ్య రాగుల వినియోగం పెరుగుతుంది. రాగి జావ ను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీలైతే రాగిజావను తీసుకోవడం మరీ మంచిది. ఓట్స్, పాలు, డ్రైప్రూట్స్ తీసుకోవచ్చు. ప్రూట్ సలాడ్ తీసుకున్నా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేసేవారు ఇడ్లీ తీసుకుంటారు. ఆ తరువాత పాలు తీసుకోవడం ఎనర్జిటిక్ గా ఉంటుంది. అయితే చాలా మంది టిఫిన్ పేరుతో ఆయిల్ ఫుడ్ తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వచ్చి ఆనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేసినా లైట్ ఫుడ్ తీసుకోవడం ఎంతో మంచిది.