https://oktelugu.com/

Lassa fever: లస్సా ఫీవర్ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏంటంటే?

ఈ మధ్య కాలంలో చాలా మంది లస్సా ఫీవర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ ఫీవర్ బారిన పడుతున్నారు. ఈ లస్సా ఫీవర్ అనేది వైరస్ వల్ల వస్తుంది. లస్సా అనే ఒక తీవ్రమైన వైరల్ హెమరేజిక్. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2024 / 04:29 AM IST

    Lassa Fever

    Follow us on

    Lassa fever: ఈ మధ్య కాలంలో చాలా మంది లస్సా ఫీవర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ ఫీవర్ బారిన పడుతున్నారు. ఈ లస్సా ఫీవర్ అనేది వైరస్ వల్ల వస్తుంది. లస్సా అనే ఒక తీవ్రమైన వైరల్ హెమరేజిక్. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ లస్సా ఫీవర్ అనేది మాస్టోమిస్ నటాలెన్సిస్ అనే ఎలుక ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఫీవర్ చాలా ప్రమాదకరమైనది. ఈ వైరల్ ఫీవర్ బెనిన్, ఘనా, గినియా, లైబీరియా, మాలి, సియెర్రా లియోన్, టోగో, నైజీరియాలలో ఎక్కువగా వ్యాపించింది. అయితే ఈ ఫీవర్ బారిన పడిన వారిలో 15 శాతం వరకు మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ లస్సా జ్వరం అనేది 1969లో మొదటిగా వచ్చింది. ప్రస్తుతం కూడా ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎలుకల వచ్చే ఈ ప్రమాదకరమైన ఫీవర్‌తో కొన్ని సార్లు మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

    ఈ లస్సా ఫీవర్ బారిన పడిన వారు తొందరగా బలహీనం అవుతారు. మొదట జ్వరం, జలుబు వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, దగ్గు, కడుపు నొప్పి వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫీవర్ తీవ్రమైతే కొందరికి ముఖంపై వాపు, ఊపిరితిత్తుల కుహరంలో ద్రవం చేరడం, నోరు, ముక్కు, యోని లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి రక్తస్రావం రావడం, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి దాదాపుగా.. 6 నుంచి 21 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ ఫీవర్ వచ్చిన తర్వాత 1 నుంచి 3 వారాల వరకు లక్షణాలు కనిపిస్తాయి. ఫీవర్ తీవ్రం అయితే మాత్రం కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపించిన 14 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా గర్భం దాల్చిన వారికి ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. గర్భస్రావం కావడం లేకపోతే గర్భిణి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    ఈ లస్సా ఫీవర్ నుంచి విముక్తి చెందాలంటే మొదటిగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గొంతు, మూత్ర పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఇది ఎక్కువగా ఎలుకల వల్ల వస్తుంది. కాబట్టి ఎలుకలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో ఏ చిన్న లక్షణం కనిపించిన కూడా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఈ ఫీవర్ వస్తే ఆలస్యం చేయకూడదు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అసలు ఎలుకలను పెంచకూడదు. వీటికి చాలా దూరంగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తాగుతూ, పోషకాలు ఉండే పదార్థాలు తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు మందులు కూడా వాడాలి. అప్పుడే ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.