Land buyers : డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ జీవతం బాగుండాలని కోరుకుంటారు. ఇందు కోసం కొన్ని తమకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు.వీటిలో పధానమైనది ఆహారం, దుస్తులు, నివాసం. ప్రతీ కుటుంబం స్థిరంగా ఉండాలంటే ముందుగా సరైన నివాసం ఉండాలి. ఆ తరువాత ఇతర ఆస్తులను కూడబెట్టుకోవాలి. అయితే ఇల్లు, ఇతర భూములను కష్టపడి డబ్బు సంపాదించి కొనుగోలు చేస్తుంటారు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల వాటిని చేజార్చుకుంటారు. ప్రస్తుత కాలంలో పక్కన ఉన్న వారే మోసం చేస్తున్నారు. ముఖ్యంగా భూముల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వేరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. భూములకు సంబంధించి ఎన్ని పత్రాలు ఉన్నా.. కొందరు నకిలీవి సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
ప్రస్తుతం ప్రతిదీ డిజిటలైజేషన్ జరుగుతోంది. ఏ చిన్న పని అయినా ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వాలు సైతం కొన్ని కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇక భూములను కూడా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. అయితే కొందరు ఎంతో శ్రమకోర్చి విలువైన భూములను కొనుగోలు చేస్తారు. కానీ వాటిని డిజిలైజేషన్ చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తారు. ఇలా ఉన్న వారిని గ్రహించిన కొందరు భూములను కాజేసే అవకాశం ఉంది. ఇది ఎవరో కాకుండా తెలిసిన వారే చేసే అవకాశం ఉంది.
భూములు కొనుగోలు చేసే సమయంలో ల్యాండ్ కు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించాలి. అవసరమైతే డూబ్లికేట్ పత్రాలను తీసుకొని కొంత సమయం గడువు కోరాలి. ఈ సమయంలో భూమికి పక్కనున్న వారితో పాటు ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే భూమిని పలువురికి విక్రయించే వారు ఉంటారు. డూబ్లీకేట్ పత్రాలతో వీలైతే ఈసీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పటి వరకు ఎంతమందికి ఈ భూమి రిజిస్ట్రేషన్ అయింది? ప్రస్తుతం ఎవరి పేరు మీద ల్యాండ్ ఉందన్న విషయం తెలుస్తుంది.
భూములు కొనుగోలు సమయంలో కన్వినెంట్ ఉన్న వారిని మాత్రమే పక్కన ఉంచుకోవాలి. కొందరు పక్కనే ఉన్నట్టుండి ప్రత్యర్థులకు సాయం చేసే అవకాశం ఉంది. అంటే నకిలీ ల్యాండ్ ను కూడా బలవంతంగా కొనుగోలు చేయించేవారు ఉంటారు. అందువల్ల పక్కన ఉన్న వారు మంచి వారైతేనే న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో వారు ఏ విధంగా మాట్లాడుతారో గ్రహించాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి తొందరపాటు ఉండకూడదు. రిజిస్ట్రేషన్ చేసే ముందు జిరాక్స్ పత్రాలను ఇచ్చి చెక్ చేసుకోమంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా వివరాలు పరిశీలించాలి. ప్రస్తుతం ప్రతీ భూ రికార్డు ఆధార్ తో లింక్ అయి ఉంటుంది. అందువల్ల ఆధార్ తో రిజిస్ట్రేషన్ పత్రాలు వివరాలు సమానంగా ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. ఈ విషయంలో కాస్త సమయంల తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే మీతో వచ్చిన వ్యక్తిని పరిశీలించమనాలి. ఎందుకంటే మీరు ఆందోళనలో ఉండి సరిగా చూడలేరు. ఇతరులు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వివరాలు తప్పుగా నమోదైతే మార్చుకోవడం కష్టంగా మారుతుంది.