Cheapest Cars: అన్నింటికంటే చవకైన కారు ఏదో తెలుసా? ఫీచర్లలోనూ ది బెస్ట్?

ఆటోమోబైల్ మార్కెట్లో హ్యుందాయ్, మారుతి, స్కోడా, కియాతో పాటు హోండా కంపెనీలను ఎస్ యూవీ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి.తాజాగా హోండా తన ఎస్ యూవీ కాంపాక్ట్ కారు గురించి వివరించింది.

Written By: Chai Muchhata, Updated On : September 5, 2023 5:49 pm

Cheapest Cars

Follow us on

Cheapest Cars: ఏదైనా వస్తువు కొనాలనుకుంటే షాపు వారు చేసే ధర కంటే తక్కువకు ఇవ్వాలని కోరుతాం. కానీ పెద్ద పెద్ద వస్తువులు మాత్రం బార్గానింగ్ కు అవకాశం ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు ఆయా వర్గాలకు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ కు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. కానీ వీటి ఫీచర్లు అద్భుతంగా ఉండడంతో అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. ఇంతకీ ఆ కార్ల గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే వెంటనే కిందికి వెళ్లండి..

ఆటోమోబైల్ మార్కెట్లో హ్యుందాయ్, మారుతి, స్కోడా, కియాతో పాటు హోండా కంపెనీలను ఎస్ యూవీ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి.తాజాగా హోండా తన ఎస్ యూవీ కాంపాక్ట్ కారు గురించి వివరించింది. ఈ కారును రూ.11 లక్షల నుంచి రూ.16లక్షల వరకు విక్రయిస్తున్నారు. వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ తో 8 ఇంచుల టచ్ స్క్రీన్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 7 ఇంచుల సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ పోన్ చార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

ఇది 121 పీఎస్ ఇంజన్, 145 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ సీబీటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికలు ఉన్నాయి. ఇలాంటి ఫీచర్లు కలిగిన కార్లు దాదాపు 15 నుంచి రూ.20 లక్షల వరకు విక్రయిస్తారు. కానీ దీని ధర రూ.11 లక్షలతో ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కు పొందాలనుకున్నారు. కానీ ఇది సిటీ సెడాల్ లో అందించింది.

హోండతో పాటు మిగతా కంపెనీల కార్ల ధరలను చూస్తే హ్యుందాయ్ క్రెటా రూ.10.87 లక్షల నుంచి రూ.19.20 లక్షలకు విక్రయిస్తున్నారు. కియా సెల్టోస్ రూ.10.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మారుతి గ్రాండ్ విటారా రూ.10.70 లక్షల నుంచి మొదలవుతుంది. అన్నింటికంటే గ్రాండ్ విటారా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. కానీ అప్డేట్ ఫీచర్లు పొందాలనుకువారు వాటిని చెక్ చేసుకొని వారికి అనుగుణంగా ధర కాస్తా అటూ ఇటూ ఉన్నా ఈ మోడళ్లు ఆకర్షిస్తున్నాయి.