https://oktelugu.com/

Keerthy Suresh : కీర్తి సురేష్, శివ కార్తికేయన్ లవ్ బ్రేకప్ అవ్వడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? చూస్తే ఆశ్చర్యపోతారు!

తమిళనాడు లో ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరోలలో ఒకరు శివ కార్తికేయన్. ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 03:05 PM IST

    Keerthy Suresh and Siva Karthikeyan love breakup is there such a big story..? You will be surprised!

    Follow us on

    Keerthy Suresh : తమిళనాడు లో ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరోలలో ఒకరు శివ కార్తికేయన్. ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘అమరన్’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం తో ఆయన తమిళనాట స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే. అయితే ఈయన గురించి రీసెంట్ ఇంటర్వ్యూ లో ప్రముఖ జర్నలిస్ట్ సబితా జోసెఫ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో శివ కార్తికేయన్ ప్రముఖ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయట.

    వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ‘రెమో’ అనే చిత్రంలో హీరో హీరోయిన్లు గా నటించారు. ఆ సినిమాలో తమిళం తో పాటు, తెలుగు లో కూడా మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారని, ఈ విషయం ఇరువురి కుటుంబాలలో తెలిసి పెద్ద గొడవ అయ్యిందని, అప్పటి నుండి వీళ్లిద్దరు మాట్లాడుకోవడం, కలిసి సినిమాలు చేయడం ఆపేశారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, వీళ్లిద్దరు కలిసి ‘రెమో’ తర్వాత మళ్ళీ నటించలేదు. దీనిని బట్టి చూస్తే నిజమేనేమో అని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇది ఇలా ఉండగా కీర్తి సురేష్ వచ్చే నెల 11 వ తేదీన గోవా లో ఆంటోనీ తాటిల్ అనే వ్యక్తిని పెళ్లాడబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి చెప్పుకొచ్చాడు.

    కేరళలో ఒక మంచి వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ఆంటోనీ కీర్తి సురేష్ తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్నీ ఇన్ని రోజులు రహస్యంగా ఉంచిన కీర్తి సురేష్, ఇప్పుడు అకస్మాత్తుగా సర్ప్రైజ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొద్దిరోజుల క్రితమే ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ తో ప్రేమాయణం నడుపుతుంది, త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. వీటిల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తండ్రి కొట్టిపారేశాడు. కేవలం అనిరుద్ తో మాత్రమే కాదు, తమిళ హీరో విజయ్ తో కూడా కీత్య్ సురేష్ ప్రేమాయణం నడుపుతున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. విజయ్ రాజకీయాల్లో వచ్చిన ఈ నేపథ్యంలో ఆయన్ని ట్రోల్ చేసేందుకు ఇలాంటి విషయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థులు. ఇప్పుడు ఆమె బయట వ్యక్తిని పెళ్లాడబోతుంది అంటూ అధికారిక ప్రకటన రావడంతో, ఇన్ని రోజులు ప్రచారమైన రూమర్స్ కి చెక్ పడినట్టు అయ్యింది.