Dinesh Karthik- Rishabh Pant: టీమిండియాలో సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లున్నారు. దినేష్ కార్తీక్ తోపాటు రిషబ్ పంత్ కూడా ఒకరు. దీంతో దినేష్ కార్తీక్ అవసం టీమిండియాకు ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15వ ఓవర్లో వెన్నునొప్పి కారణంగా దినేష్ ఆట నుంచి నిష్ర్కమించాడు. దీంతో అతడి స్థానంలో పంత్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో గెలిచే మ్యాచ్ ను చేజేతులా చేజార్చుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలవోకగా నెగ్గే మ్యాచ్ ను అపజయంతో ముగించడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు.

బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు దినేష్ కార్తీక్ అందుబాటులో ఉండటం లేదు. దీనిపై బీసీసీఐ కూడా ప్రకటన చేయనుంది. డీకే దూరమైతే పంత్ అందుబాటులోకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్ దినేష్ కార్తీక్ దూరం కావడం లోటే అని చెబుతున్నారు. డీకే జట్టు నుంచి దూరం కావడంతో విజయం దక్కుతుందా లేదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో వస్తున్నాయి. దినేష్ కార్తీక్ లాంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో లేకపోవడం లోటే అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. డీకే జట్టులో ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయనేది వారి వాదన.
పాకిస్తాన్, జింబాబ్వేలపై విజయాలు నమోదు చేసుకుని ఊపు మీదున్న భారత్ సఫారీలపై పోరులో కడదాకా వచ్చి మ్యాచ్ సమర్పించుకోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జారవిడిచిన క్యాచులతో దక్షిణాఫ్రికా విజయం సాధించిందనే చెబుతున్నారు. మనవారి చెత్త ఫీల్డింగ్ తోనే మూల్యం చెల్లించుకున్నట్లు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా రెండు మ్యాచ్ లు ఉండటంతో డీకే జట్టులో లేకపోతే ఫలితం ఎలా వస్తుందోననే అనుమానాలు వస్తున్నాయి. ఇండియా ఓటమితో పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. భారత్ గెలిస్తే పాక్ ఆశలు సజీవంగా ఉండేవి. టీ20 వరల్డ్ కప్ లో తరువాత వచ్చే మ్యాచ్ ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో తెలియడం లేదు. డీకే లేని లోటు పంత్ తీరుస్తాడా? అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి పంత్ జట్టులోకి రావడానికి డీకే బాటలు వేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ జట్టు కూర్పుపై దృష్టి సారిస్తోంది.