Homeట్రెండింగ్ న్యూస్భార్య అంటే ఎంత ప్రేమ అతనికి ! చ‌నిపోయిన భార్య ప్లేస్ లో మైనంతో బొమ్మెందుకు...

భార్య అంటే ఎంత ప్రేమ అతనికి ! చ‌నిపోయిన భార్య ప్లేస్ లో మైనంతో బొమ్మెందుకు చేయించాడు?

House Warming With Wife Wax Statue:: ఈ సృష్టిలో భార్యాభ‌ర్త‌ల బంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక‌రిక కోసం మ‌రొక‌రు ఆ జన్మాంతం క‌లిసి మెలిసి బ‌త‌క‌డ‌మే దాంప‌త్య జీవితం ప‌ర‌మార్థం. అయితే భార్య లేదా భ‌ర్త స‌డెన్ గా తమ జీవితంలోకి వెళ్లిపోతే మాత్రం.. ఆ జీవితం న‌ర‌క‌మ‌నే చెప్పుకోవాలి. కాగా త‌మ మ‌ధ్య జీవిత భాగస్వామి లేని లోటు ఉండొద్ద‌ని ఈ మ‌ధ్య చాలామంది వారి జ్ఞాప‌కార్థం ఏదో ఒక‌టి చేస్తున్నారు.

House Warming With Wife Wax Statue:
House Warming With Wife Wax Statue:

కాగా ఇప్పుడు క‌ర్ణాట‌క‌లోని కొప్పాల్ ప్రాంతంలో నివ‌సించే శ్రీనివాస్ గుప్తా కూడా త‌న భార్య జ్ఞాప‌కార్థం చేసిన ప‌ని అంద‌రి మ‌న‌సుల‌ను క‌దిలిస్తోంది. త‌న భార్య వెంక‌ట నాగ‌మాధ‌వి అంటే అత‌నికి ఎంతో ఇష్టం. భ‌ర్త శ్రీనివాస్‌ను భార్య ఎంతో ప్రేమ‌గా చూసుకునేది. వాస్త‌వానికి శ్రీనివాస్‌కు నాగ‌మాధ‌వితో పెండ్లి అయిన త‌ర్వాత ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అన్న‌ట్టు ఏ బిజినెస్ చేసినా కోట్ల‌లో లాభాలు వ‌చ్చాయి.

Also Read:  ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు

కాగా వారి అన్యోన్య‌త‌ను చూసి కాలానికి క‌న్నుకుట్టినట్టుంది. నాగ‌మాధ‌వి మ‌ర‌ణించింది. 2017లో కుటంబం అంతా క‌లిసి తిరుప‌తికి ద‌ర్శ‌నానికి వెళ్లింది. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకుని తిరుగు ప్ర‌యాణం అవుతున్న స‌మ‌యంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగి నాగ‌మాధ‌వి మృతి చెందింది. కాగా భార్య మ‌ర‌ణాన్ని శ్రీనివాస్ త‌ట్టుకోలేక‌పోయాడు.

House Warming With Wife Wax Statue:
House Warming With Wife Wax Statue:

త‌న ఇంట్లో భార్య క‌నిపించ‌క‌పోయే స‌రికి ఆ లోటు అత‌న్ని వెంటాడ‌సాగింది. భార్య చ‌నిపోయే స‌మ‌యంలో త‌మ క‌ల‌ల ఇంటిని ప్రారంభించారు. అది పూర్తి కావ‌స్తున్న స‌మ‌యంలోనే భార్య చ‌నిపోవ‌డం అత‌న్ని మ‌రింత బాధించింది. అయితే గృహ ప్ర‌వేశానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో.. భార్య కూడా త‌న‌తో పాటే కొత్త ఇంట్లో ఉండాల‌ని ఆమె మైన‌పు బొమ్మ‌ను త‌యారు చేయించాడు శ్రీనివాస్‌. అచ్చం జీవం ఉట్టి ప‌డే విధంగా ఆర్టిస్టు శ్రీధ‌ర్ నాగ‌మాధ‌వి బొమ్మ‌ను త‌యారు చేశాడు. కాగా భార్య మైన‌పు బొమ్మ‌తో శ్రీనివాస్ గృహ ప్ర‌వేశం చేశాడు. కాగా ఈ వార్త ఇప్పుడు అంద‌రినీ క‌దిలిస్తోంది.

Also Read:  మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు

Recommended Video:

పవన్ సీఎం అభ్యర్థి, టీడీపీకి షాక్  | BJP Want to Make Pawan Kalyan as AP CM | Janasena BJP Alliance

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version