Kangana Ranaut’s: నటనతో పాటు, కంగనా రనౌత్ తన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. ఈమె మాటల వల్ల ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె తన భావాలను ప్రజల ముందు బహిరంగంగా వ్యక్తపరచడంలో ఏమాత్రం వెనుకాడదు. తను వెడ్స్ మను నటి ఇటీవల ఒక విషయాన్ని వెల్లడించింది. ఇది ఖచ్చితంగా ఏ సామాన్యుడినైనా షాక్‌కు గురి చేస్తుంది. ఈ విషయం విన్న తర్వాత మేబీ మీరు కూడా షాక్ అవుతారు కావచ్చు. ఎందుకంటే ఈసారి తన ఒక నెల విద్యుత్ బిల్లు లక్ష రూపాయలు వచ్చిందట. షాక్ అయ్యారా? ఇంతకీ ఎక్కడ? ఏ ఇంటికి? అందులో ఎక్కువ మంది ఉంటున్నారా? అంత ఎందుకు వచ్చింది వంటి వివరాలు తెలుసుకుందాం.
ఏ ఇంటికి ఈ విద్యుత్ బిల్లు వచ్చింది?
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కంగనా రనౌత్ నిజానికి హిమాచల్ ప్రదేశ్ నివాసి. కానీ ఆమె పని వల్ల ఎక్కువ సమయం ముంబైలోని తన ఇంట్లో గడుపుతుంది. ఇటీవల, బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ మండిలో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో, తన మనాలి ఇంటికి వచ్చిన విద్యుత్ బిల్లుకు సంబంధించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కంగనా రనౌత్ ఈ వైరల్ వీడియోను రాహుల్ చౌహాన్ అనే వ్యక్తి తన అధికారిక x ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో కంగనా మాట్లాడుతూ..
“ఈ నెల నేను నివసించని మనాలిలోని నా ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అంటూ మాట్లాడింది. ఇది రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ కాబట్టి కంగనా రాజకీయాలను సంబంధించిన అంశాల గురించి మాట్లాడింది. మనందరికీ ఒక అవకాశం ఉంది, మీరందరూ నా సోదరులు, సోదరీమణులు. మీరంతా ఎంతో చాలా పని చేస్తున్నారు. మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు, ఈ దేశాన్ని, ముఖ్యంగా రాష్ట్రాన్ని పురోగతి మార్గంలో తీసుకెళ్లడం మనందరి బాధ్యత. అందుకే రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్న తోడేళ్లను తరిమేయాలి అంటూ మాట్లాడింది.
ఎమర్జెన్సీ తర్వాత, కంగనా రనౌత్ ఇప్పుడు ఈ సినిమాల్లో కనిపిస్తుంది.
కంగనా రనౌత్ తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా, సినిమాల్లో కూడా నిరంతరం చురుగ్గా పాల్గొంటోంది. నటి రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, తను వెడ్స్ మను తర్వాత ఆమె మరోసారి ఆర్ మాధవన్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకుంటుంది. అంతేకాదు కంగనా రనౌత్ మరోసినిమాలో కూడా కనిపించబోతుంది. ఇంకా ఈ సినిమా పేరు అనౌన్స్ చేయలేదు. దీనితో పాటు, ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తను వెడ్స్ మను 3 కోసం చర్చలు జరుగుతున్నాయట. దీనితో పాటు, నటి క్వీన్ 2 లో కూడా కనిపిస్తుందట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.