Kadam Fruit: శారీరక శ్రమ, పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది పేగు, జీర్ణ సమస్యలతో ఎక్కువగా సతమతమవుతున్నారు. తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోతే ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు వాడటంతో పాటు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్యలను తగ్గించుకోవడం కష్టం అవుతుంది. జీవన శైలిలో మార్పులు, ఆహార అలవాట్లు కాస్త మార్చాలి. ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే డైట్‌లో తప్పకుండా కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. అయితే మనలో చాలా మందికి కొన్ని రకాల పండ్ల గురించి తెలియదు. అలాంటి వాటిలో కదం పండు ఒకటి. చాలా అరుదుగా దొరికే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి తొందరగా విముక్తి చెందుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యలను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఈ కదం పండు ఎక్కువగా రాజస్థాన్‌లో దొరుకుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఈ పండులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. కడం పండులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపించడంతో పాటు ముఖంపై ముడతలను కూడా తగ్గిస్తుంది. అలాగే తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా కాపాడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటంలో కాపాడుతుంది. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనే వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. అయితే ఈ పండు అధికంగా తినడం వల్ల కొందరికి జలుబు, దగ్గు, కఫం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కదం పండు ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు రైతులకు కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఈ కడం పండు కలప చాలా విలువైనది. దీనితో బల్లలు, ఫర్నిచర్, టేబుల్స్ వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారట. ఈ కలప చాలా బలంగా ఉండటంతో పాటు మన్నికైనది. ఈ పండు, కలపతో రైతులు మంచి లాభాలను పొందుతారు. సాధారణ కలప చాలా ఖరీదు ఉంటుంది. అలాంటి ఈ కలపను ఎక్కువగా నిర్మాణ పరిశ్రమలో వాడుతారు. అందుకే ఈ కలపకి మంచి డిమాండ్ ఉంది. ఈ పండును పండించడం వల్ల రెండు విధాలుగా కూడా లాభాలను పొందవచ్చు. ఈ పండు డైలీ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే ఆర్థికంగా ప్రయోజనాలు రెండు ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఈ కదం పండును చూశారా? చూస్తే ఎక్కడ చూశారో కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.