Jym: ఫిట్‌గా ఉండాలని చాలా మంది అబ్బాయిలు జిమ్‌కి వెళ్తుంటారు. నిజం చెప్పాలంటే రోజులో సగం సమయం జిమ్‌లోనే ఉంటారు. డైలీ జిమ్ చేయడం వల్ల చాలా ఫిట్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కేవలం పురుషులు అనే కాకుండా ఈ రోజుల్లో మహిళలు కూడా ఎక్కువగా జిమ్‌కి వెళ్తున్నారు. ఫిట్‌గా ఉండటంతో పాటు యంగ్ లుక్‌లో కనిపించాలని జిమ్ చేస్తున్నారు. జిమ్ చేయడం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావు. అయితే దేనిని అయిన కూడా చేయాల్సిన పరిమితి వరకు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువగా చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే జిమ్ కూడా తక్కువగానే చేయాలి. ఎక్కువ సమయం చేయడం వల్ల పురుషులకు కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పురుషులు ఎక్కువగా జిమ్ చేస్తే ఫెర్టిలిటీ సమస్యలతో పాటు వంధత్వ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో మూడు నుంచి నాలుగు గంటలు జిమ్ చేయడం వల్ల తప్పకుండా వీటి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా జిమ్ చేసేటప్పుడు టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తారు. ఎక్కువ సమయం ఇలా టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే దుస్తుల వల్ల బాడీ వేడి అవుతుంది. దీంతో శుక్ర కణాలు చనిపోతాయని చెబుతున్నారు. అలాగే కొందరు నాణ్యమైన దుస్తులను ధరించరు. వీటి వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కాబట్టి జిమ్‌కి వెళ్లేవారు తప్పకుండా వదులుగా ఉండే దుస్తులను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరు గంటల తరబడి జిమ్ చేస్తుంటారు. ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా కండరాల్లో తిమ్మిరి రావడం, నొప్పిగా అనిపిస్తాయి. మరీ బరువు ఉన్నవి ఎత్తడం వల్ల కండరాలు బలహీనం అవుతాయని నిపుణులు అంటున్నారు. కొందరు జిమ్‌కి వెళ్తారు. కానీ పోషకాలు ఉండే ఆహారం తీసుకోరు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు జిమ్‌లో జాయిన్ అయిన మొదటి రోజు ఎక్కువగా వర్క్‌వుట్‌లు చేస్తుంటారు. దీనివల్ల ఒక్కసారిగా బాడీ పెయిన్స్ వస్తాయి. ఇలా కాకుండా ఒక్కో రోజు తక్కువ నుంచి ఎక్కువగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జిమ్‌కి వెళ్లేవాళ్లు ఎక్కువగా తినాలి. గుడ్లు, పోషకాలు ఉండే ఫుడ్, అరటి పండ్లు, పాలు, పెరుగు, చికెన్, మటన్ వంటి పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవాలి. లేకపోతే జిమ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. దీనివల్ల ఇంకా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.