Hyderabad: భవిష్యత్‌లో భారత ఉపఖండంలో వేడిగాలులు విపరీతంగా పెరుగుతాయని, దీని ప్రభావం హైదరాబాద్‌పై భారీగా పడుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) అంచనా వేసింది. ఐపీసీసీ హైదరాబాద్ వాసులను హెచ్చరించింది. హైదరాబాద్ లో వేడిగాలుల తీవ్రత భారీగా ఉంటుందని.. ఇది అనారోగ్యాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఇది వృద్ధులకు ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించింది.
వర్షపాతం కూడా వైవిధ్యంగా పెరుగుతుందని.. వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్‌కు చెందిన అంజల్ ప్రకాష్ తెలిపారు. హైదరాబాద్‌లో కూడా అధిక-తీవ్రతతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తవచ్చని నివేదించారు. కర్బన ఉద్గారాలు.. ఇతర కాలుష్య కారకాలను తగ్గించడానికి ప్రజలు కలిసి పనిచేయాలని ప్రకాష్ కోరారు.
వికేంద్రీకృత.. సమ్మిళిత వాతావరణం హైదరాబాద్ ను భయపెడుతుందన్నారు. ఈ వాతావరణాన్ని తట్టుకోగల మౌలిక సదుపాయాలను ప్రజలు పెట్టుకోవాలని సూచించారు. హరితహారం వంటి కార్యక్రమాలు దీన్ని తగ్గించడానికి ఉపయోగపడుతాయన్నారు. పట్టణ – పెరి-అర్బన్ ప్రాంతాల్లో మొక్కలు పెంచాలని సూచించారు.
Also Read: కాలినడకన ఉక్రెయిన్ నుంచి పారిపోయిన స్టార్ హీరో
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రంలో చెట్లను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇది ఉపయోగపడుతుందన్నారు. పట్టణ సరస్సులు.. వాటి జలపాతాల రక్షణ ఈ కాలంలో అవసరమన్నారు.. నదులు, కాలువలు, చెరువులు మొదలైన నీటి వనరులను పెంచుకోవాలని సూచించారు. అవి నెమ్మదిగా క్షీణిస్తున్నాయని హెచ్చరించారు. ఇక వరదల నివారణకు డ్రైనేజీ వ్యవస్థను కూడా తిరిగి పునర్నిర్మించాలన్నారు. సాధ్యమైన పరిష్కారాలను వీలైనంత త్వరగా అమలు చేయాలన్నారు.
దీర్ఘకాలిక ఉపశమన ప్రయత్నాలు ఒక లక్ష్యంగా పెట్టుకోవాలని.. హైదరాబాద్ లో లాగానే ఇతర నగరాలకు ఆదర్శం కావాలని అంజల్ ప్రకాష్ సూచించారు. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. వాతావరణ ఉపశమన ప్రణాళికలను అనుసరించడానికి రాష్ట్ర -జాతీయ స్థాయిలో ప్రత్యేక వాతావరణ మార్పు మంత్రిని నియమించాలని సూచించారు.
Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మరణానికి ముందు ఏం జరిగింది? చివరి మాటలు వైరల్.. షాకింగ్ నిజాలు