https://oktelugu.com/

Relationship : భార్యను సంతోషపెట్టడానికి మేడలు కట్టాల్సిన పనిలేదు.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..

ఇంట్లోని కొన్ని పనులతో ఆడవారు ఒత్తిడితో కనిపిస్తారు. దీంతో వారితో మాట్లాడడానికి కొందరికి భయం వేస్తుంది. ఇదే సమయంలో భర్త ప్రేమగా దగ్గరికి వెళ్లినా చికాకు పడుతారు. ఇలాంటప్పుడు వారి ఇష్టాలను తెలుసుకోవాలి. వారు ఏం చేస్తే బాగా సంతోషిస్తారో.. ఆ పనిచేయాలి. కొందరికి అందమైన మాటలు అంటే చాలా ఇష్టం.

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2024 / 04:11 AM IST

    Wife and Husband Relation Tips

    Follow us on

    Relationship :  అందమైన జీవితం ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే అందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు అలా కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ లైప్ లో భార్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లు ఇంట్లో ఆడవారు హ్యాపీగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఇందు కోసం వారి కోసం మేడలు కట్టాల్సిన పనిలేదు.. యుద్ధాలు చేయడం అంతకన్నా అవసరం లేదు. కేవలం ఈ చిట్నాలు పాటిస్తే చాలు.. మీరు వద్దన్నా..వారు మీ వెంటనే ఉంటారు.. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..

    ఇంట్లోని కొన్ని పనులతో ఆడవారు ఒత్తిడితో కనిపిస్తారు. దీంతో వారితో మాట్లాడడానికి కొందరికి భయం వేస్తుంది. ఇదే సమయంలో భర్త ప్రేమగా దగ్గరికి వెళ్లినా చికాకు పడుతారు. ఇలాంటప్పుడు వారి ఇష్టాలను తెలుసుకోవాలి. వారు ఏం చేస్తే బాగా సంతోషిస్తారో.. ఆ పనిచేయాలి. కొందరికి అందమైన మాటలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి వారికి ఒక పేపర్ పై ఏదైనా కవిత్వం రాసి చివరికి I love You అని రాయాలి. ఇలా చేయడం వల్ల తమను ఎంత భర్త ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటుంది. దీంతో ఒక్కసారిగా వారి మనసు హ్యీపీగా మారుతుంది.

    చాలా మంది ఆడవాళ్లు తమ మీద పెత్తనం చెలాయించడం అంటే ఇష్టపడరు. తమకు అనుగుణంగా లేదా.. తమతో సమానంగా ఉండడం అంటే ఇష్టపడుతారు. ఇలాంటప్పుడు వారితో సమానమే అన్నట్లుగా కొన్ని విషయాల్లో ప్రవర్తించాలి. ఉదాహరణకు ఏదైనా ఫుడ్ తీసుకొచ్చినప్పుడు దానిని షేర్ చేసుకోవాలి. లేదా ఎప్పడైనా బహుమానం వచ్చినప్పుడు తనకు కూడా భాగమే అన్నట్లు చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారికి భర్తపై నమ్మకం పెరుగుతుంది. దీంతో చాలా హ్యాపీగా ఉంటారు.

    కొంత మంది లేడీన్ నార్మల్ గా కాకుండా భిన్నంగా ఉండాలని అనుకుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఇదే సమయంలో ఎవరైనా గిప్ట్ లు, సర్ ప్రైజ్ లు ఇస్తే ఎక్సైట్మెంట్ గా ఫీలవుతారు. అలాంటి వారికి అప్పుడప్పుడు కొన్ని సర్ ప్రైజ్ లు ఇస్తుంటాయి. వారు ఊహించిన విధంగా బహుమతులు కొనివ్వాలి. లేదా వారు బాగా ఇష్టపడే ప్రదేశాలకు తీసుకెళ్లాలి. వారు ఇష్టపడే కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు తీసుకెళ్లడం ద్వారా ఎక్కువగా సంతోషిస్తారు.

    కొందరు కార్యాలయాలు, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఇంట్లో చెప్పరు. దీంతో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తీవ్రంగా బాధపడుతారు. అయితే ఎప్పటిప్పుడు ఆఫీస్ విషయాలను షేర్ చేసుకోవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు విలువైన సలహాలు ఇస్తుంటాయి. వారి సలహాలు పాటించి సమస్య పరిష్కరించుకున్నట్లయితే వారు చెప్పిన మాట విన్నారని ఎంతో సంతోషిస్తారు. దీంతో భవిష్యత్ లోనూ మరింత కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా కార్యాలయాల్లో జరిగే కొన్ని ఫంక్షన్లకు తీసుకెళ్లడం ద్వారా వారి మనసు ఉల్లాసంగా మారుతుంది.