https://oktelugu.com/

Joint pains: కీళ్ల నొప్పులతో విముక్తి పొందాలంటే.. ఈ యోగాసనాలు వేయాల్సిందే!

కీళ్ల సమస్య ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. అయితే కీళ్ల సమస్యల నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా డైలీ కొన్ని యోగాసనాలు చేయాలి. మరి అవేంటోఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 04:48 PM IST

    Joint pains

    Follow us on

    Joint pains: వయస్సు, జీవనశైలిలో మార్పులు పెరగడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిన తర్వాత అనారోగ్య సమస్యలు రావడమనేది సాధారణమే. కానీ ఈ రోజుల్లో పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది కీళ్ల సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయిన విముక్తి చెందాలంటే ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాడీకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని పోషకాలు ఉంటే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కీళ్ల సమస్యలకు జాగ్రత్త వహించకపోతే ఆర్థరైటిస్, బోలు ఎముకల బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కొందరు యంగ్ ఏజ్‌లోనే కీళ్ల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే నడవడం, ఎక్కువ సమయం కూర్చోకపోవడం, తమ పనులు కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. అయితే కీళ్ల సమస్యల నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా డైలీ కొన్ని యోగాసనాలు చేయాలి. మరి అవేంటోఈ స్టోరీలో తెలుసుకుందాం.

    త్రికోనాసనం
    కీళ్ల నొప్పులను వదిలించుకోవాలనుకుంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా త్రికోనాసనం వేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల ఎముకలు ఆరోగ్యగంగా ఉంటాయి. రోజు ఒక పది నిమిషాల పాటు ఈ ఆసనం వేయడం వల్ల ఎలాంటి కీళ్ల సమస్యలైనా నయమైపోతాయి. కొంతమంది దీర్ఘకాలికంగా కీళ్ల సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ త్రికోనాసనం వేయడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతారు.

    చక్రాసనం
    చక్రాసనం వేయడం వల్ల కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ చక్రసనం 10 నిమిషాల పాటు వేస్తే మీ ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే ఆరోగ్యంగా కండరాలు కూడా బలంగా తయారవుతాయి. కీళ్ల సమస్యలు తగ్గడానికి ఆహారం ఎంత ముఖ్యమో ఈ ఆసనం కూడా అంతే ముఖ్యం.

    ఉస్త్రాసనం
    కీళ్ల నొప్పులను తగ్గించడానికి, ఉస్త్రాసనను తరచుగా వేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం వల్ల కీళ్ల సమస్యలు తగ్గడంతో పాటు తొందరగా బరువు కూడా తగ్గుతారు. బరువు తగ్గాలంటే వారికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఆసనం రోజు వేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా

    వీరభద్రాసనం
    ఎముకలను బలోపేతం చేయడంలో వీరభద్రాసనం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని వారాలు ఈ ఆసనం చేయడం వల్ల కీళ్ల సమస్య నుంచి తొందరగా విముక్తి చెందుతారు. ఆసనాలు చేయడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎలాంటి ఒత్తిడికి ఆందోళన గురికాకుండా కూడా ఈ ఆసనాలు బాగా సాయపడతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.