https://oktelugu.com/

Jio AirFiber : వచ్చేసింది జియో ఎయిర్‌ఫైబర్.. ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే!

జియో ఎయిర్ ఫైబర్‌ను అధికారికంగా లాంఛ్ చేసింది రిలయన్స్ జియో. ఎయిర్‌ ఫైబర్‌ ఒక వైర్‌లెస్‌ డివైస్‌ దీంతో ఇంట్లో ఉన్న ఎన్ని డివైజ్‌లకు అయినా వైఫై ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2023 10:26 pm
    Jio-Air-Fiber

    Jio-Air-Fiber

    Follow us on

    Jio AirFiber : వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ లాంఛ్ అయింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణె నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్‌ను అధికారికంగా లాంఛ్ చేసింది రిలయన్స్ జియో. ఎయిర్‌ ఫైబర్‌ ఒక వైర్‌లెస్‌ డివైస్‌ దీంతో ఇంట్లో ఉన్న ఎన్ని డివైజ్‌లకు అయినా వైఫై ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

    5జీ ఆధారిత వైఫై సర్వీస్‌..
    జియో ఎయిర్‌ ఫైబర్‌ పూర్తిగా 5జీ ఆధారిత వైఫై డివైజ్‌. అత్యంత వేగంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలకు ఇంటర్నెట్‌ సదుపాయం అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్‌ సర్వీస్‌లకు ప్రత్యామ్నాయంగా దీనిని తయారు చేశారు. జియో ఫైబర్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలను అందిస్తుంది. అంటే ఆప్టికల్‌ కేబుల్స్‌ ద్వారా ఇళ్లు, ఆఫీసులకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తోంది. ఎయిర్‌ ఫైబర్‌ మాత్రం ఎలాంటి కేబుల్స్‌ అవసరం లేకుండానే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తుంది. డివైజ్‌ ఆన్‌ చేయగానే ప్రత్యేక రేడియో లింక్‌ ద్వారా సమీపంలోని టవర్‌ నుంచి సిగ్నల్‌ అందుకుని ఇంటర్నెట్‌ అందిస్తుంది.

    ప్లాన్స్‌ ఇలా..
    జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ కేవలం రూ.599 నుంచే ప్రారంభం అవుతాయి. మొత్తం 6 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, గృహ అవసరాలు, బిజినెస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు ప్లాన్స్ రూపొందించింది రిలయన్స్ జియో. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి డేటా బెనిఫిట్స్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

    అదనపు సౌకర్యాలు..
    జియో ఎయిర్‌ఫైబర్‌తో హైస్పీడ్ వైఫై సర్వీస్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ పీసీ, సెక్యూరిటీ, సర్వేలెన్స్ సొల్యూషన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ , స్మార్ట్ హోమ్ ఐఓటీ, గేమింగ్, హోమ్ నెట్వర్కింగ్ లాంటి సేవల్ని పొందొచ్చు. వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టీవ్ రిమోట్ ఉచితంగా లభిస్తాయి.