https://oktelugu.com/

Jackfruit: జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

కొందరికి తెలియక జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను తింటారు. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2024 10:21 pm
    Jack fruit

    Jack Fruit

    Follow us on

    Jackfruit: మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు రోజూ మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ చాలామందికి కొన్ని రకాల పండ్లు గురించి మాత్రమే తెలుసు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొన్ని రకాల పండ్లు కేవలం సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. అయితే అందరికి జాక్‌ఫ్రూట్ గురించి తెలిసిందే. దీనిని పనస పండు అని కూడా అంటారు. ఇది వేసవిలో మాతమే దొరుకుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పనస కాయను కూరల్లో, బిర్యానీలో కూడా వాడుతుంటారు. మరికొందరు దీంతో ఊరగాయ కూడా పెడుతుంటారు. ఈ పండు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ పండులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే కొందరికి తెలియక ఈ పండు తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను తింటారు. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    పాలు
    పనస పండు ఆరోగ్యానికి మంచిదే. కానీ తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాలతో చేసిన పదార్థాలు కూడా తినకూడదు. ఎందుకంటే వెంట వెంటనే తినడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనస పండు తిన్న తర్వాత పాలు తాగితే గజ్జి, దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు రావడంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

    తేనె
    పనస పండు, తేనె కలయిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పనస పండు తిన్న వెంటనే తేనెతో చేసిన ఏ పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే రెండు కలిపి తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    బెండకాయ
    కొందరు పనస పండు తిన్న వెంటనే బెండకాయలను తింటారు. ఇలా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ముఖంపై తెల్ల మచ్చలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బెండకాయ ఆరోగ్యానికి మంచిదే. ఇందులోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీన్ని ఎక్కువగా వేపుడు లేదా పులుసు పెట్టి తింటారు.

    బొప్పాయి
    బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే దీన్ని జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత బొప్పాయి తినడం వల్ల శరీరంలో వాపు వస్తుంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు కలిపి తీసుకోవద్దు. వేర్వేరుగా తీసుకోవడం ఉత్తమం.

    తమలపాకు
    భోజనం తర్వాత కొందరు తమలపాకును తినడానికి ఇష్టపడతారు. అయితే దీన్ని పనస పండు తిన్న తర్వాత అసలు తినవద్దు. దీనివల్ల కడుపు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమలపాకు ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకేసారి తినడం వల్ల కడుపులోకి వెళ్లిన తర్వాత ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.