Isha Ambani: తండ్రి ముఖేష్ అంబానీపై గెలిచిన కూతురు.. సంచలనం సృష్టించిన ఇషా..

ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇద్దరు కుమారులు, కూతురుకు భాగం పంచిన విషయం తెలిసిందే. ఇందులో కూతురు ఇషా రిలయన్స్ రిటైల్ ను నడిపిస్తున్నారు.

Written By: Srinivas, Updated On : August 4, 2023 4:39 pm

Isha Ambani

Follow us on

Isha Ambani: ‘కంటే కూతుర్నే కనాలి’ అని ఓ సాంగే కాదు.. సినిమా కూడా వచ్చింది. ఒకప్పుడు ఇంట్లో కుమారుడే సరైన వారసుడు అని భావించారు. కానీ ఇప్పుడు యువతులు, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ధీటుగా నిలుస్తున్నారు. అంతరిక్షంలోకి కూడా అడుగుపెట్టేందుకు మహిళలు రెడీ అవుతున్నారంటరే వారు ఎంతటి గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. కొడుకైనా.. కూతురైనా పుట్టగానే ముందుగా సంతోషించేది తండ్రి మాత్రమే అంటారు. అలాగే వారు జీవితంలో వారు విజయం సాధించినప్పుడు ఆ ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆ ఆనందాన్ని పొందుతున్నాడు. అసలు మ్యాటర్లోకి వెళ్తే..

ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇద్దరు కుమారులు, కూతురుకు భాగం పంచిన విషయం తెలిసిందే. ఇందులో కూతురు ఇషా రిలయన్స్ రిటైల్ ను నడిపిస్తున్నారు.2022 ఆగస్టులో ఈమెకు బాధ్యతలు అప్పగించారు.ఇటీవల రిలయన్స్ రిటైల్ లో కొత్త భాగస్వామ్యాలు, విస్తరణ శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని నెలలుగా ఆఫ్ లైన్ స్టోర్లు, జియో మార్ట్, కొత్త కామర్స్ ప్లాట్ పారమ్ ల పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీ తో EBITDA భారీగా పెరుగుతోంది. ఇది 2027 నాటికి రూ.18900 కోట్లకు చేరుకుంటుందని బెర్న్ స్టెయిన్ నివేదిక వెల్లడించింది.

రిలయన్స్ రిటైల్ తో పాటు జియో మార్ట్ ఫ్లాట్ ఫాంలు 77 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఇషా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఫ్రీమ్ రూ.2 లక్షల టర్నోవర్ గా సాధించారు. కొత్త బ్రాండ్లు అయినా బ్రూక్స్ బ్రదర్స్ , అర్మానీ, ఎక్చేంజ్, బుర్బెర్రీ, మైఖేల్ కోర్స్, వెర్సేస్, హ్యూగో బాస్ వంటివి రిలయన్స్ లో భాగస్వామిగా మారాయి. దీంతో రిలయన్స్ రిటైల్ రంగం రోజురోజుకు అభివృద్ధి సాధిస్తూ వస్తోంది.

ప్రస్తుతం ముఖేష్ కు చెందిన రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం రూ..4,71,295 కోట్లు ఉంది. ఇషాకు చెందిన రిటైల్ సంస్థల విలువ రూ.9,26,055 కోట్లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ బెర్న్ స్టెయిన్ అంచానా వేసింది. ఇలా ఒకే గ్రూపులోని వివిధ రంగాలు ఒకటి కంటే మరొకటి పై చేయి సాధించడం ఆసక్తిగా మారింది. అందులోనూ తండ్రి బాధ్యతలు నిర్వహిస్తున్న రంగం కంటే కూతురు ఇషా బాధ్యతలు చేపట్టని రిటైల్ సంస్థలు ఎక్కువగా ఉండడంపై వ్యాపారం రంగంలో చర్చనీయాంశంగా మారింది.