Cashew: జీడి పప్పును ఇలా తింటున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే..

పోషకాల మెండుగా జీడిపప్పును కొలుస్తారు. ఇందులో విటమిన్ ఇ, కె, బీ 6 లు అధికంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, జింక్ తో పాటు మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి పోషకాలున్న జీడిపప్పును తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : September 11, 2023 4:49 pm

Cashew

Follow us on

Cashew: జీడిపప్పును ఇష్టపడని వారుండరు. డ్రై ఫ్రూట్స్ లో అత్యధికంగా పోషకాలు ఉండే దీనిని వంటల్లో కూడా వాడుతూ ఉంటారు. బిర్యానీలో దీనిని వేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా స్వీట్స్ లోనూ జీడిపప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జీడిపప్పును కొందరు రకరకాల పద్ధతుల్లో తీసుకుంటారు. ముఖ్యంగా దీనిని మార్కెట్ లోకి తీసుకొచ్చిన తరువాత నేరుగా తింటారు. కానీ ఇలా తినడం వల్ల ప్రమాదమేనని అంటున్నారు. జీడిపప్పును తినడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పోషకాల మెండుగా జీడిపప్పును కొలుస్తారు. ఇందులో విటమిన్ ఇ, కె, బీ 6 లు అధికంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, జింక్ తో పాటు మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి పోషకాలున్న జీడిపప్పును తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని కొన్ని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. బరువు తగ్గాలనుకునేవారు దీనిని డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి.

జీడిపప్పును మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన తరువాత నేరుగా తింటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఉరుషియోల్ అనే రసాయన పదార్థం కొంతమందిలో రియాక్షన్ అవుతుందని అంటున్నారు. ఇది చర్మ సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతుందట. అందువల్ల దీనిని నేరుగా కాకుండా రోస్ట్ చేసి తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీడిపప్పును రోస్ట్ చేయడం వల్ల టాక్సిన్స్ అనే పదార్థం దూరం అవుతుంది.

అయితే ప్రై బెస్ట్ ఆప్షన్ అనుకొని చాలామంది మసాలా, ఇతర పదార్థాలు వేస్తుంటారు. కానీ ఇలా వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కేవలం రోస్ట్ చేసిన జీడిపప్పును తినడం వల్ల మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇక ఇతర పదార్థాల్లో వేసుకొని తినడం వల్ల కూడా జీడిపప్పు ఆరోగ్యమేనని చెబుతున్నారు.