https://oktelugu.com/

skin care : స్కిన్ పగులుతోందా? ఎందుకు? ఎలా జాగ్రత్త పడాలో తెలుసా?

ఆహారంలో అధిక చక్కెర ఉంటే కూడా మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కెరను మితంగానే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గించవచ్చు. ఫలితంగా నూనె, మొటిమలు తగ్గుముఖం పడతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2024 / 07:30 AM IST

    skin cracking

    Follow us on

    skin care : చర్మ సౌందర్యం గురించి ఎవరు తహతహలాడరు చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు. అయితే చాలా మంది చర్మ సౌందర్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు స్కిన్ ప్రాబ్లమ్స్ మాత్రం వారిని ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణంలో మార్పులు, కాలుష్యం వల్ల కొందరిలో చర్మం పొడిబారి పగుళ్లు కనిపిస్తుంటాయి. ఇలా కనిపిస్తే చర్మం చూడటానికి అసలు బాగుండదు. అంతేకాదు ఇది సమస్యగా కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా వస్తుంది. తగ్గించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

    కొందరికి ఈ సమస్య ఇన్ఫెక్షన్ గా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములను వాడుతారు కానీ ఫలితం ఉండదు. అయితే ఈ సమస్య కొందరిలో జన్యులోపం, శరీరంపై ఆయిల్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వస్తాయట. ముడతలు, చర్మంపై పగుళ్లు వంటివి ఏర్పడి స్కిన్ ను చూడాలంటే కూడా ఇబ్బందిగా అనిపించేలా చేస్తుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఆస్తమా, జలుబు, వారసత్వ వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్మం మీద పగుళ్లు వస్తుంటాయి అంటున్నారు.

    మొటిమలు, కొలెస్ట్రాల్ తగ్గేందుకు వాడే మందుల వల్ల చర్మంపై పగుళ్లు వస్తాయట. ఒకవేళ చర్మం పొడిబారి ఇన్ఫెక్షన్ వస్తే ఆలస్యం చేయకూడదు.వెంటనే డెర్మటాలజిస్టులను సంప్రదించాలి. దీనిపై డాక్టర్స్ సలహా తీసుకోవడం వల్ల సమస్యను చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

    మొహం మీద, చర్మం మీద ఎప్పటికప్పుడు ఫ్రీ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కొన్ని చర్మ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మాయిశ్చరైజర్ మీ చర్మాన్ని కాపాడడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా మీ చర్మాన్ని పొడిగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పర్యావరణంలోని కఠినమైన ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది మాయిశ్చరైజర్. కానీ మంచి మాయిశ్చరైజర్ ను ఎంచుకోవడం ఉత్తమం.

    ఆహారంలో అధిక చక్కెర ఉంటే కూడా మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కెరను మితంగానే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గించవచ్చు. ఫలితంగా నూనె, మొటిమలు తగ్గుముఖం పడతాయి. చక్కెర తక్కువగా తినడం వల్ల చర్మంలో మంట కూడా తగ్గి స్కిన్ కూల్ గా ఉంటుంది. ఎక్కువసేపు స్నానం కూడా చేయవద్దట. ఇలా చేస్తే మొటిమలు, పొడి, దురద చర్మం ఏర్పడుతుంది. పొడి కారణంగా, మీ చర్మం పగులిపోతుంది. ఆ చర్మం ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది పలు చర్మ వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, మీ షవర్ సమయాన్ని 10-15 నిమిషాలకు పరిమితం చేయడం ఉత్తమం. చర్మం పొడిబారకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మీ చర్మ సమస్యలను మరింత తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే మీకు సమస్య తగ్గకపోతే కచ్చితంగా మీ చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. అంతేకాకుండా, మెరుగైన చర్మ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా చర్మవ్యాధి నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.