Maruti Suzuki Celerio: మారుతి సుజుకి వ్యాపారంలో దూసుకుపోతోంది. దేశంలోనే మేలైన దిగ్గజంగా రాణిస్తున్న మారుతి సుజుకి సెలెరియో విపణిలో తనదైన పాత్ర పోషిస్తోంది. మారుతి సుజికి పాత మోడల్ కు అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగలేదు. దీంతో కొత్త మోడల్ ను తయారు చేసింది. దీంతో అమ్మకాలు జోరు అందుకున్నాయి. కొత్తగా తయారు చేసిన మోడల్ తో వ్యాపారం కొత్తపుంతలు తొక్కింది. 2022 జూన్ నెలలో 8683 యూనిట్లు అమ్ముడుపోయి రికార్డు సాధించింది. 2021 జూన్ నెలలో 752 యూనిట్లు మాత్రమే అమ్మిన మారుతి ఇప్పుడు పెరగడంతో వ్యాపారం ముందంజలో నిలిచింది.

2022 జూన్ లో మారుతి అమ్మకాలు 1055 వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హం. సెలెరియో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. వ్యాపారంలో నూతన పంథాలో నడుస్తోంది. కంపెనీ పురోగమనంలో నడుస్తోంది. నూతనంగా తయారు చేసిన మోడల్ ఆకర్షణీయంగా ఉండటంతో వినియోగదారులు ఎగబడుతున్నారు. దీంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందంజలో నిలుస్తోంది. మారుతి సుజికి సెలెరియో మోడల్ నూతన శకం సృష్టిస్తోంది. కార్ల అమ్మకాల్లో తనదైన శైలిలో దూసుకుపోతూ వ్యాపారం రెండింతలు చేస్తోంది.
మారుతి సుజుకి సెలెరియో 26.68 కేఎంపీఎల్ మైలేజీ ఇవ్వడంతో అందరు దీనివైపే చూస్తున్నారు. దీంతో మారుతి సుజుకి సెలెరియో కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కొత్త వాహనం ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. దీంతో కొత్త తరహా వ్యాపారాన్ని సృష్టిస్తోంది. కార్ల అమ్మకాల్లో రికార్డులు సాధిస్తోంది. అనుకున్న ప్రకారం మార్కెట్లో అమ్మకాలు జోరందుకోవడంతో మారుతి సుజుకి సెలెరియో పంట పండినట్లు అవుతోంది. వ్యాపార రంగంలో ద్విగుణీకృతమవుతోంది.

మారుతి సుజుకి సెలెరియో ఇస్తున్న మైలేజీతో వినియోగదారులు ఎక్కువగా దీన్ని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా మారుతి సుజుకి సెలెరియోతో లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. అందుకే దీన్ని కొనుగోలు చేసి మంచి లాభాలు పొందాలని చూస్తున్నారు. అందుకే మారుతి సుజుకి సెలెరియా వాహనాల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా అమ్మకాలు కూడా అదే రేంజిలో దూసుకుపోవడం గమనార్హం.