https://oktelugu.com/

Walking vs. Running: నడవడం కంటే పరిగెత్తటం మంచిదా? అమెరికా పరిశోధకులు ఏం చెప్పారు?

మహిళల్లో బరువు అధికంగా పెరగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అమెరికా పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం బరువు అధికంగా ఉన్న వారిలో గర్భాశయం, రొమ్ము, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2023 / 12:06 PM IST
    Follow us on

    Walking vs. Running: నేటి కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో బరువు తగ్గడానికి కొన్ని ప్రత్యేక మెడిసిన్స్, ఆయుర్వేద మందులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీంతో అవసరమైన మెడిసిన్స్ కొన్ని తీసుకుంటూ పర్సనల్ గా కొన్ని రకాల వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని కొందరు పరిశోధకులు తేల్చారు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనం వెల్లడిస్తోంది.

    మహిళల్లో బరువు అధికంగా పెరగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అమెరికా పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం బరువు అధికంగా ఉన్న వారిలో గర్భాశయం, రొమ్ము, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గుండె సమస్యలు కూడా త్వరగా సంక్రమించే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు మెడిసిన్స్ మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఇలాంటి వ్యాయామం చేయాలని అంటున్నారు.

    సాధారణంగా బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తున్నారు. అయితే వాకింగ్ చేయడం వల్ల శారీరక శ్రమ తక్కువగానే ఉంటుంది. దీంతో అధిక కేలరీలు కరుగవు. ఇదే సమయంలో నడవడం కంటే పరుగెత్తడం వల్ల ఎక్కువ కేలరీలు తగ్గించేంచుకునే అవకాశం ఉంటుంది. నడవడం కంటే పరుగెత్తిన వారిలో గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గి ఎముకలు గట్టిపడతాయి. ఎముకల జాయింట్లను కూడా సంరక్షిస్తుంది.

    నడిచే వారిలో కంటే పరుగెత్తిన వారిలో చర్మ సమస్యలు కూడా దరిచేరవు. వీరిలో పోషకాలు సమద్ధిగా సరఫరా అవుతాయి. వ్యర్థాలు త్వరగా బయటకు పోతాయి. రన్నింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు కదులుతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చాలా మందిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు కనిపిస్తుంది. కానీ పరుగెత్తిన వారిలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల నడవడం కంటే పరుగెత్తిన వారిలో దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండవని అమెరికా పరిశోధకులు తేల్చారు.