GST: మనం వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోం. కానీ అవగాహన లేని వారి కారణంగా చాలా డబ్బులు నష్టపోతుంటాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఆ వస్తువుకు సంబందించి డిస్క్రిప్షన్ మొత్తం ప్యాక్ డ్ కవర్ పై తెలుపుతుంది. తాము వస్తువును ఎలా తయారు చేశాం? ఎక్కడ తయారు చేశాం? అనే వివరాలను ఉంచుతుంది. వీటితో పాటు ఆ వస్తువుకు ఎంత ధర? అనేది నిర్ణయిస్తుంది. ప్రతీ ప్యాక్ డ్ కవర్ పై MRP ధరను ముద్రించి రిలీజ్ చేస్తుంది. అయితే కొందరు షాపు వారు MRP ప్రైస్ తో పాటు GST ని కూడా వసూలు చేస్తున్నారు. అలా చేస్తే ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి.. ఎందుకంటే?
MRP అంటే Maximum Retail Price. అంటే కొనుగోలుదారుడు ఈ వస్తుపై అంతే చెల్లించాలని అని నిర్ణయించే ధర. అయితే ఏజెన్సీలు, ఇతర షోరూంలకు కంపెనీలు విక్రయించేటప్పుడు కూడా ఎమ్మార్పీ కంటే తక్కువగానే ఇస్తుంది. అయితే కొందరు షాపు నిర్వాహకులు మాత్రం MRP కంటే ఎక్కువకు విక్రయిస్తారు. అలాగే మరికొందరు MRPతో విక్రయించినా వీటికి అదనంగా GST ఇతర టాక్స్ ను వసూలు చేస్తుంటారు. ఇదేమని అడిగితే అది ప్రభుత్వ పన్ను అని చెబుతున్నారు.
కానీ ఇక్కడ వినియోగదారులు గమనించాల్సిన విషయమేంటంటే.. కొనుగోలు చేసిన వస్తుపై MRP అని ఉండి పక్కనే మరో బాక్సులో (Inclusive All Taxes) అని రాసి ఉంటుంది. అంటే కంపెనీ వాళ్లే GSTతో సహా ఇతర పన్నులను చెల్లిస్తారు. అలా వాటన్నింటిని బేరీజు చేసుకొని MRPని నిర్ణయించామని తెలుపుతుంది. అయితే షోరూం వాళ్లు మాత్రం అవగాహన లేని వారికి MRPతో పాటు ఇతర పన్నులు వేసి అదనంగా డబ్బులు తీసుకుంటారు.
ఈ సమయంలో ఒకేవేళ షోరూం లేదా షాపు వాళ్లు వినకపోతే కొన్ని నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రభుత్వమే చెప్పింది. 1800-11-40000, 1800-11-1404 నెంబర్లకు కంప్లయింట్ చేయొచ్చు. లేదా ప్రొడక్ట్ సంబంధించిన కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఎవరైనా మీ నుంచి MRP కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు ఎవరైనా అలా వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయండి..