Homeక్రీడలుIPL 2022: Sunrisers Hyderabad: త‌డ‌బ‌డి.. నిల‌బ‌డి.. అగ్రస్థానంలోకి.. ఇది క‌దా ఎస్ఆర్ హెచ్ అంటే..!

IPL 2022: Sunrisers Hyderabad: త‌డ‌బ‌డి.. నిల‌బ‌డి.. అగ్రస్థానంలోకి.. ఇది క‌దా ఎస్ఆర్ హెచ్ అంటే..!

IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్ లో ఊహించని టీమ్ లు అనూహ్యంగా సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి మహా మహులు అనుకున్న జట్లను మట్టికరిపిస్తున్నాయి. గతంలో ఐపీఎల్ కప్ కొట్టినా కొంతకాలం స్టార్ ప్లేయర్స్ లేమి వల్ల హైదారాబాద్ లాంటి జట్టు కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని ఔరా…అనిపిస్తుంది. మొదటి స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ టైటన్స్ పరిస్థితి అదే. ఐపీఎల్ అంటేనే టక్కున గుర్తొచ్చే చెన్నై సూపర్ కింగ్స్,ముంబాయ్ ఇండియన్స్ జట్లు ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్టాయికి దిగజారిపోయాయి. దీంతో ఎవ్వరు ఊహించని ఈ జట్లు కప్ ఎగరేసుకుపోతాయా అన్న సందేహం అందరిలో కలుగుతుంది.

IPL 2022: Sunrisers Hyderabad
IPL 2022: Sunrisers Hyderabad

ఈ రెండు జట్లమీద ఎలాంటి అంచనాలు లేకుండానే ఐపీఎల్ బరిలోకి దిగాయి. స్టార్ ఆటగాళ్ళు జట్టులో లేరు. 2022 సీజన్ వేలంలో అసలు ఈ జట్లకు సభ్యత్వం ఉంటుందా అన్న ప్రశ్న అందరిని తొలిచింది. వేలం తర్వాత కూడా చాలా మంది ఈ రెండు జట్ల ను విమర్శించిన వాళ్ళే అధికంగా వున్నారు. జట్లలో స్టార్ ఆటగాళ్ళు లేకపోవడంతో ఈ జట్లు పూర్తిగా బలహీనంగా వున్నాయి అంటూ మాట్లాడుకున్నారు అంతా. అయితే వారి అంచనాలను పటాపంచలు చేస్తూ పాయింట్ల పట్టికలో ఈ జట్లే అగ్రస్థానంలో వున్నాయి. శనివారం కోల్ కత్త నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ గెలుపుతో ఈ సీజన్ లో 6వ గెలుపు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం సొంతం చేసుకుంది.

Also Read: Virat Kohli: క్రికెట్ కింగ్‌కు ఏమైంది.. మరోసారి కోహ్లీ గోల్డెన్ డకౌట్.. 14 ఏళ్లలో ఇదే తొలిసారి..!

మరో వైపు బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించిన సన్ రైజర్స్ హైదారాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్ళింది. దీంతో ఇరు జట్లు రన్ రేట్ లో కూడా బాగా మెరుగుపడ్డాయి. ఎలాంటి అంచనాలు లేకున్నా ఆ జట్లు ప్రత్యర్థుల భరతం పడుతూ విజయాల పరంపర కొనసాగిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో ఈ రెండు జట్లను చూసి నవ్విన వాళ్ళంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ సీజన్ లో ఏ జట్టు ఎన్ని పాయింట్లు సాధించిందో ఒక లుక్కేద్దాం…..

IPL 2022: Sunrisers Hyderabad
IPL 2022: Sunrisers Hyderabad

1) గుజరాత్ టైటన్స్ 7 మ్యాచ్ లు ఆడగా అందులో 6 విజయాలు సాధించి 12 పాయింట్ల తో అగ్రభాగంలో కొంసాగుతుంది. 2) సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ లల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. 3) రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ లల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. 4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్ లల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది.

5) లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచ్ లల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్ల తో 5వ స్థానంలో కొనసాగుతుంది. 6) ఢిల్లీ క్యాపిటల్స్ 7మ్యచ్ లల్లో 3 విజయలు సాధించి 6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. 7) కోల్ కత్తా నైట్ రైడర్స్ 8మ్యచ్ లల్లో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో 7వ స్థానంలో వుంది. 8) పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లల్లో 3 విజయాలు సాధించి 6 పాయింట్ల తో 8వ స్థానంలో వుంది. 9) చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్ లల్లో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో 9వ స్థానంలో వుంది. 10) ముంబాయ్ ఇండియన్స్ 7 మ్యాచ్ లల్లో ఒక్క విజయం కూడా లేకుండా చివరి స్థానంలో కొనసాగుతుంది.

Also Read:CM Kcr- Prashant Kishor: కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలుస్తాయా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ భారీ డైలమాలో కూరుకుపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు సర్వం సిద్ధం చేసుకున్న పీకే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ వచ్చి, టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తో భేటీ కావడం టీ కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. దీంతో ఇన్నాళ్లు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి వద్దామని కలలుగన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది.. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular