Homeక్రీడలుIPL 2022: రైజర్స్ కథ మళ్లీ కంచికి.. సభ్యులు మారినా తలరాత మారలే.. టాప్ లోకి...

IPL 2022: రైజర్స్ కథ మళ్లీ కంచికి.. సభ్యులు మారినా తలరాత మారలే.. టాప్ లోకి ఆ జట్టు

IPL 2022: ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు టీమ్‌లు సత్తా చాటుతున్నాయి. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో లక్నో 12 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. వ‌రుస‌గా ఈ టోర్నీలో ల‌క్నో టీమ్ కు ఇది రెండో విజ‌యం. రాహుల్‌, దీపక్‌హుడాల బ్యాటింగ్‌కు తోడు అవేశ్ ఖాన్ చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమిని ఎదుర్కొంది.

IPL 2022
IPL 2022

టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 68 పరుగులు, దీపక్ హుడా 51 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు అంతంత ‌మాత్రంగానే ఆడ‌టంతో లక్నో భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తరువాత బరిలో దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు 170 పరుగుల లక్ష్యం ఛేదించలేక ఓట‌మిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులు, నికోలస్ పూరన్ 34 పరుగులు చేసినా నెగ్గ‌లేకపోయింది.

Also Read: YCP Focus On Visakhapatnam: ఆ నాలుగింటిపైనే వైసీపీ ఫోకస్.. సాగర నగరంలో ఏం జరుగుతోంది?

వ‌రుస‌గా రెండో విజ‌యం న‌మోదు చేసుకున్న‌ లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు రెండు గెల‌వ‌గా ఒక‌ ఓటమితో త‌న ఖాతాలో 4 పాయింట్లు వేసుకుంది. టోర్నీలో ఇంకా బోణి చేయ‌ని సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచ్ లు ఆడి గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్ టాప్ లో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓట‌మితో కోల్‌కతా నైట్‌ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్ లో గెల‌వ‌గా మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్‌ కింగ్స్ రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో సెటిలైంది. ఢిల్లీ క్యాపిట్సల్ ఒక మ్యాచ్ విజ‌యం సాధించి, మ‌రో మ్యాచ్ ఓట‌మితో ఆరో ప్లేసు ఖాయం చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక మ్యాచ్ విన్ అవ‌గా మ‌రో మ్యాచ్ ఓట‌మి‌తో ఏడో స్థానంలో నిలిచింది. ఇక టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క విజ‌యం కూడా న‌మోదు చేయ‌ని ముంబై ఇండియన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ వరుసగా 8,9 వ స్థానాల్లో ఉన్నాయి.

IPL 2022
IPL 2022

అత్య‌ధిక ప‌రుగులు తీసిన ఆట‌గాళ్లు..

ఈ సీజ‌న్ లో అత్యధిక పరుగులు చేసిన వారికి బహూకరించే ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ ముందున్నాడు. ఇత‌డు రెండు మ్యాచ్‌ల్లో క‌లిపి మొత్తం 135 పరుగులు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్‌ రెండో ప్లేసులో ఉన్నాడు. కాగా హైద్రాబాద్‌తో అర్ధసెంచరీ చేసిన లక్నో బ్యాటర్‌ దీపక్‌ హుడా మూడో స్థానానికి చేరుకున్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు శివమ్ దూబే నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక‌ సన్‌రైజర్స్ తో కెప్టెన్సీ ఇన్సింగ్స్‌ తో ఆకట్టుకున్న రాహుల్‌ ఐదో ప్లేసులో నిలిచాడు.

అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన‌ బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇప్పటివరకు మొత్తం 8 వికెట్లు తీసి టాప్ లో కొన‌సాగుతున్నాడు . లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ 7 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో రాహుల్‌ చాహర్‌ మూడో స్థానంలో, 5 వికెట్లతో యుజువేంద్ర చాహల్‌ నాలుగో స్థానంలోకి వ‌చ్చారు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Also Read:Russia Ukraine War: ఉక్రెయిన్ లో ప్రజల ఊచకోత.. రష్యా దారుణాలు..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular