Salt: మానవ శరీరానికి లవణం అవసరం. లవణం అంటే సోడియం క్లోరైడ్. శరీరంలోని అనేక విధులను నిర్వహించడానికి, కండరాల పనితీరును మెరుగు పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సోడియం క్లోరైడ్ ఉప్పులో అధికంగా ఉంటుంది. శరీరానికి కచ్చితంగా ఎంత ఉప్పు కావాలనేది ప్రమాణికం లేదు. అయితే 1.25 గ్రాముల సోడియం క్లోరైడ్ అవసరం ఉంటుందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. సోడియం క్లోరైడ్ ను వివిధ పదార్థాల ద్వారా తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కూరల్లో ఉప్పు లేకుండా రుచిగా ఉండదు. శరీరానికి అవసరమైన సోడియం క్లోరైడ్ లేకపోయినా ఇబ్బందులు తప్పవు. అయితే మార్కెట్లో దొరికు ప్యాకెట్ ఉప్పు అంత మంచిది కాదని చాలా మంది నిపుణులు అంటున్నారు. రాళ్ల ఉప్పు శ్రేష్టం అని తెలుపుతున్నారు. ఎందుకంటే?
పూర్వకాలంలో రాళ్ల ఉప్పును ఎక్కువగా వాడేవారు. ఆ కాలంలో ఇప్పడు లభించే ప్యాకెట్ ఉప్పు లభించేది కాదు. దీంతో కొందరు సముద్రం వద్ద పండించిన ఉప్పును నేరుగా తీసుకొచ్చి గ్రామాల్లో అమ్మేవారు. ఇందులో ఎలాంటి కలుషితం లేకపోవడంతో ఆ కాలంలోని వారు లవణం కొరత సమస్యలు ఎదుర్కోలేదు. అంతేకాకుండా రక్తపోటు, నరాల బలహీనత లాంటి సమస్యలకు గురి కాలేదు.
అయితే ఇప్పుడు చాలా మంది రక్తపోటుకు గురవుతున్నారు. పెద్దవారే కాకుండా చిన్న పిల్లలు గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు రోజూ వాడే ఉప్పు కూడా కారణమని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు నేచురల్ ది కాదని కొందరి అభిప్రాయం. సోడియం, క్లోరైడ్, అయెడిన్ అనే మూడు పదార్థాలు కలిసి కృత్రిమ రసాయనాలతో దీనిని తయారు చేస్తున్నారని అంటున్నారు. ఈ ఉప్పు అసలు నీటిలో కరుగదు. స్పటికల్లాగా మెరుస్తూ ఉంటుంది. దీంతో ఈ ఉప్పును తిన్నవారు గుండెసంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని కొందరి నిపుణుల అభిప్రాయం.
రాళ్ల ఉప్పు మాత్రం సహజమైనది. ఇందులో 72 ఖనిజ లవణాలు ఉంటాయి. సోడియం, క్లోరైడ్, అయెడిన్లు ఉంటాయి. కానీ ఇవి సహజసిద్ధంగా వచ్చినవి. ఈ ఉప్పు నీళ్లలో వేసిన వెంటనే కరిగిపోతుంది. రాళ్ల ఉప్పును తినడం వల్ల కండరాల సమస్య పరిష్కారం అవుతుంది. తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. రాత్రి వెళల్లో అరికాళ్లలో నొప్పులు వస్తే రాళ్ల ఉప్పు ను కొంచెం నీళ్లల్లో వేసుకొని తాగడం వల్ల నయమవుతుంది. అందువల్ల ఇప్పటికైనా రాళ్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు.