UGC Guidelines : నిన్నామొన్నటి దాకా డిగ్రీ కంటే మూడేళ్ల కోర్సు. పీజీ తత్సమాన కోర్సు అభ్యసించాలంటే డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సిందే. యూపీ ఎస్‌సీ, టీఎస్ పీఎస్‌సీ వంటి పోటీ పరీక్షలు, ఇతర ఉద్యోగాల కోసం పోటీ పడాలంటే డిగ్రీలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది. కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి మార్పులు చేయకపోవడంతో డిగ్రీ ఓ సంప్రదాయ కోర్సులగానే ఉండేది. కానీ ఇప్పుడు అందులో పూర్తి మార్పులు చేపట్టింది యూజీసీ.
క్షేత్రస్థాయి అధ్యయనం తప్పనిసరి
ఇక మీదట డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి అధ్యయనం (ఇంటర్న్‌షిప్) తప్పనిసరి. మూడేళ్ల సాధారణ డిగ్రీ విద్యార్థులు కోర్సు పూర్తయ్యేలోపు 60 నుంచి 120 గంటల వ్యవధి గల ఇంటర్న్‌షి్‌పను పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల వ్యవధి ఉండే ఆనర్స్ (రీసెర్చ్) విద్యార్థులైతే 360 గంటల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. పరిశోధనకు, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే నూతన విద్యావిధానం-2020కు అనుగుణంగా వీటిని రూ పొందించారు. వీటి ప్రకారం.. ఇంటర్న్‌షి్‌పను క్రెడిట్ల రూపంలో కొలుస్తారు.
ఒక సెమిస్టర్‌లో 15 వారాలు
ఒక సెమిస్టర్‌లో 15 వారాలుంటాయి. వారానికి రెండు గంటల క్షేత్రస్థాయి అధ్యయనం చొప్పున ఒక సెమిస్టర్‌కు 30 గంటల ఇంటర్న్‌షి్‌పనకు అవకాశం ఉంటుంది. దీనిని పూర్తిచేసిన విద్యార్థికి ఒక సెమిస్టర్‌కు ఒక క్రెడిట్ లభిస్తుంది. నాలుగో సెమిస్టర్ సమయానికిగానీ, ఆ తర్వాతగానీ ప్రతి డిగ్రీ విద్యార్థి కనీసం 2-4 క్రెడిట్ల (60-120 గంటల) ఇంటర్న్‌షి్‌పను పూర్తి చేసి ఉండాలి. ఇక నాలుగేళ్ల వ్యవధి ఉండే ఆనర్స్ (పరిశోధన) చేసే డిగ్రీ విద్యార్థులకు ఎనిమిదో సెమిస్టర్ నాటికి మొత్తం 12 క్రెడిట్లు తెచ్చుకోవటం తప్పనిసరి. అంటే వీరు 360 గంటలపాటు క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ఉండాలి.
రెండు రకాల ఇంటర్న్‌షిప్
ఇంటర్న్‌షిప్ రెండు రకాలు. ఒకటి, ఉద్యోగావకాశాలను పెంచే నైపుణ్యాలను కలిగించేది కాగా, మరొకటి, పరిశోధన పట్ల ఆసక్తిని పెంచేది. విద్యార్థులు దేన్నైనా ఎంచుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థ, ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, వ్యాపార సంస్థలు, స్థానిక పరిశ్రమ లు, చేతివృత్తులు మొదలైన రంగాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం జరుపవచ్చు. విద్యార్థుల ఇంటర్న్‌షిప్ నిర్వహణ కోసం డిగ్రీ కాలేజీలు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని యూజీసీ సూచించింది. ఫీజులు, రీఫండ్ ప్రక్రియ, హాస్టల్ సదుపాయం, స్కాలర్‌షి్‌పలు, ర్యాంకింగ్‌లు, అక్రెడిటేషన్ వంటి అంశాలపై ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తమ వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలియజేయాలని పేర్కొంది.
పార్లమెంట్‌లో బిల్లు
కాగా, ఒకే నియంత్రణ సంస్థ పరిధిలోకి దేశంలోని ఉన్న త విద్యారంగాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (హెచ్‌ఈసీఐ) బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. మూడు వేర్వేరు సంస్థలుగా ఉన్న యూజీసీ, ఆలిండియా కౌ న్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ)లను హెచ్‌ఈసీఐ అనే ఒక సంస్థగా విలీనం చేయనున్నారు.