Koushik Chatterjee: ఈరోజుల్లో కొస్త డబ్బు రాగానే చాలా మంది హైఫై లైఫ్ ను మెయింటేన్ చేస్తున్నారు. ఈ భూమ్మీద ఇక తనకన్నా ధనవంతులు ఎవరూ లేరనే విధంగా ప్రవర్తిస్తారు. కానీ ‘నిండుకుండ తొలకదు’ అన్నట్లుగా.. నిజంగా డబ్బున్న వారికి వాటిపై పెద్దగా ఆశ ఉండదు. అలాంటి వారు డబ్బును పట్టించుకోకుండా మనుషులకు విలువ ఇస్తారు. టాటా కంపెనీలో ప్రముఖంగా విధులు నిర్వహించిన ఓ ఉద్యోగికి ఏడాదికి రూ.14 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. అంటే రోజుకు రూ.4 లక్షలకు పైమాటే. అయినా ఆయన పెద్దగా హడావుడి చేయకుండా తోటి ఉద్యోగులతో సమానంగా ఉంటూ వారికి విలువైన సూచనలు ఇస్తుంటారట. మరి ఆయన గురించి తెలుసుకుందామా..
భారత దిగ్గజ కంపెనీల్లో టాటా కంపెనీ ఒకటి. ఆటోమొబైల్ ,టెలికం, స్టీల్ రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ చైర్మన్ రతన్ టాటా గురించి తెలియని వారుండరు. ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్ లో ఒకరైన ఆయన ఎన్నో సంస్థలకు విరాళంగా నగదును ఇస్తుంటారు. అలాగే పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ దానకర్ముడిగా పేరొందాడు. ఆయన లాగే తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎంత ఆదాయం వస్తన్నా నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు.
టాటా గ్రూప్ లో పనిచేస్తన్నవారిలో కౌశిఖ్ చటర్జీ ఒకరు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ ఓ గా విధులు నిర్వహిస్తున్న ఈయన అత్యధిక వేతనం పొందుతున్నారు. కౌశిక్ ఫర్ యానమ్ కు రూ.14.21 కోట్లు తీసుకుంటున్నారు. అంటే రోజుకు ఆయన విలువ రూ.3.89 లక్షలు. టాటా కంపెనీలోని రూ.1,43 175 కోట్ల మార్కెట్ కు ఆయన ఇన్ చార్జిగా ఉన్నారు. చటర్జీ టాటా గ్రూప్ లో చేరే ముందు బ్రిటానియా కంపెనీలో పనిచేశారు. 36 ఏళ్ల వయసులో కౌశిక్ 2006లో టాటా గ్రూప్ లో వీపీ ఫైనాన్స్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2012 నుంచి సీఎఫ్ఓగా కొనసాగుతున్నారు.
టాటా కంపెనీకి చటర్జీ సీఈవో కాకున్నా ఆయనకు అత్యధిక వేతనం ఉండడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే గతేడాదితతో పోలిస్తే చటర్జీ ఆదాయం ఈ సంవత్సరం తగ్గింది. ఇదే కంపెనీకి చెందిన నరేంద్రన్ ఏడాదికి రూ.18.66 కోట్ల ఆదాయంతో అధిగమించాడు. అయితే కౌశిక్ ఎంత వేతనం పొందుతున్నా నిరాడంబర జీవితాన్ని గడుపుతారని అంటున్నారు. తాను ఉన్నత పదవిలో ఉన్నా చిరు ఉద్యోగులతో కలిసి మెలిసి ఉంటారని, వారికి విలువైన సలహాలు ఇస్తారని అంటున్నారు.