Instant Coffee: ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం కాఫీతోనే స్టార్ట్ అవుతుంది. కాఫీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు తాగుతారో అసలు లెక్క ఉండదు. సమయం సందర్భం లేకుండా తాగుతుంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది వారి వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. దీంతో ఈ కాఫీ చేయడానికి కూడా బద్ధకంగా ఫీల్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే కాఫీ ఏం పెద్దగా ఎక్కువ సమయం పట్టదు. కానీ కొందరు ఈ మాత్రం సమయం కూడా పెట్టి చేసుకోలేక ఎక్కువగా ఇన్‌స్టాంట్‌గా తయారయ్యే కాఫీని ఎక్కువగా తాగుతున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదని, అలాగే తొందరగా అయిపోతుందని భావించి దీనిని వాడటానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇలా ఇన్‌స్టాంట్‌గా తయారయ్యే కాఫీని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులోని కెఫిన్ అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాంటిది ఇన్‌స్టాంట్‌గా ఉండే కాఫీని తాగడం అసలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇన్‌స్టాంట్‌గా ఉండే కాఫీని తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇన్‌స్టాంట్‌గా తయారయ్యే కాఫీలో ఎక్కువగా అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనాన్ని ఎక్కువగా ప్లాస్టిక్ వంటి వాటిలో వినియోగిస్తారట. ఇలాంటి ఇన్‌స్టాంట్ కాఫీని డైలీ తాగడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఆహారాన్ని ఎక్కువగా వేడి చేస్తే ఈ రసాయనం ఉద్భవిస్తుంది. ఇన్‌స్టాంట్ కాఫీని ఎక్కువగా వేడి చేసి తయారు చేస్తారు. కాబట్టి ఈ కాఫీని తీసుకోవడం వల్ల తప్పకుండా వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఎక్కువ మొత్తంలో అక్రిలమైడ్ రసాయనం చేరకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకునే కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాఫీని తాగవద్దు.
ఇన్‌స్టాంట్ కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, మధుమేహం, అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్‌స్టాంట్ కాఫీ తాగే వారు ఏవరైనా మద్యం, ధూమపానం సేవిస్తే అక్రిలమైడ్ అనే రసాయనం ఇంకా డేంజర్‌గా మారుతుంది. కాబట్టి పూర్తిగా ఈ అలవాటుకి దూరంగా ఉండాలి. అలాగే ఆహారాలను ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. వంటలకు ఎక్కువగా మాడ్చకూడదు. ఎక్కువ శాతం వంటలను ఆవిరిపై వండటం ఆరోగ్యానికి మంచిది. ఇలా తినడం వల్ల వంటలు ఎక్కువగా ఫ్రై కావు. దీంతో అక్రిలమైడ్ అనే రసాయనం విడుదల కాదు. దీంతో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంతం వరకు ఈ నియమాలు పాటించడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.