India vs Sri Lanka: టీమిండియా అప్రతిమ విజయయాత్ర కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా విజయాల పరంపరలో దూసుకుపోతోంది. వెస్టిండీస్, శ్రీలంక లను వైట్ వాష్ చేసి ఇండియాకు ఎదురులేదని నిరూపిస్తోంది. గతంలో జరిగిన చేదు అనుభవాల నేపథ్యంలో టీమిండియా చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ఆటల్లో దూసుకుపోయేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే శ్రీలంకతో జరిగిన టీ20 మూడో మ్యాచ్ లోనూ దాన్ని ఓడించి వైట్ వాష్ చేయడం తెలిసిందే.

గత ఏడాది అపజయాలను మూటగట్టుకున్న టీమిండియా ప్రస్తుతం విజయాల బాటలో ముందుకెళుతోంది. అటు వెస్టిండీస్ ను కూడా టీ20, వన్డేల్లో వైట్ వాష్ చేసిన ఊపులో లంకను కూడా తనదైన శైలిలో ఎదుర్కొంది. మన ఆటగాళ్ల స్ఫూర్తికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టీమిండియా విజయాన్ని అందరు ఆస్వాదిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఉన్న అప్రదిష్టను తొలగించుకుంది.
Also Read: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం
టీ20 మూడో మ్యాచ్ లో శ్రీలంక 146 పరుగులు చేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ ఔట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తరువాత శాంసన్, పిమ్మట ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరడంతో ప్రేక్షకుల్లో భయం పట్టుకుంది. మ్యాచ్ పోతుందా ఏమో అనే సందేహంలో పడిపోయారు. కానీ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ మ్యాచ్ ను మలుపు తిప్పారు.

టీమిండియా పటిష్టంగా ఉండటంతో శ్రీలంక తట్టుకోలేకపోయింది. భారత్ కు విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా మారింది. దీంతో భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. లంకపై సునాయాసంగా విజయం సాధించి టీమిండియా పరువు నిలబెట్టుకుంది. లంకకు ఒక్క విజయం కూడా దక్కకుండా చేసి తిరుగులేని విధంగా ముందుకు వెళ్తోంది. అభిమానులకు కనువిందు చేస్తోంది.
ఈ సీజన్ లో వెస్టిండీస్ తో ఇటు లంకతో రెండు సిరీస్ లు నెగ్గి పటిష్టమైన జట్టుగా రూపుదిద్దుకుంటోంది. సమష్టిగా ఆడుతూ తిరుగులేని విధంగా ముందు నిలుస్తోంది. దీంతో అభిమానులను కూడా రంజింపచేస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పతకాలు సాధించి ఇండియా పరువు నిలబెట్టాలని టీమిండియా చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: నాగబాబు నోరుకు అప్పుడేమైంది?
[…] Mayank Agarwal: కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంబరం ప్రారంభం కానుంది. దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో ఒక్కో నిర్వహణ సంస్థ రూ. కోట్లు ఖర్చు చేసి ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఎలాగైనా కప్ గెలవాలనే ఉద్దేశంతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్ తమ జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ను ఎంచుకుంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లున్నా మయాంకే కీలకమని భావించి అతడిని నాయకుడిగా ఎంచుకుంది. […]