https://oktelugu.com/

WFH: వేతనం కంటే సౌఖ్యమే ముఖ్యం.. వర్క్ ఫ్రం హోం కే 71% భారతీయ ఉద్యోగుల మొగ్గు

CNBC సర్వేలో భారతదేశ వ్యాప్తంగా 1200 మందిని పరిగణలోకి తీసుకుంది. వీరి నుంచి సేకరించిన డాటా ప్రకారం ఇందులో ఎక్కువ శాతం ఇంటి నుంచి ఫ్లెక్సిబుల్ గా పనిచేయడానికే సిద్ధంగా ఉన్నట్లు తేలింది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2023 / 02:55 PM IST

    WFH

    Follow us on

    WFH: కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరి జీవన స్థితి మారిపోయింది. కరోనా సమయంలో చాలా కంపెనీలో తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించిన విషయం తెలిసింది. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు. అయితే ఇప్పుడు తిరిగి కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. కానీ ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదు. బలవంతంగా వారంలో 5 రోజులు మాత్రమే పనిచేయడానికి వస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల CNBC సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం 71 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఇష్టపడడం లేదట. తమకు వేతనం కంటే ఆరోగ్యమే ముఖ్యమేనని అంటున్నారు. ఈ సర్వే వివరాల్లోకి వెళితే..

    CNBC సర్వేలో భారతదేశ వ్యాప్తంగా 1200 మందిని పరిగణలోకి తీసుకుంది. వీరి నుంచి సేకరించిన డాటా ప్రకారం ఇందులో ఎక్కువ శాతం ఇంటి నుంచి ఫ్లెక్సిబుల్ గా పనిచేయడానికే సిద్ధంగా ఉన్నట్లు తేలింది. ఇందులో 70 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల కోసం వెతికేటప్పుడు వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఎక్కడున్నాయో వెతికారు. 67 శాతం మంది ఉద్యోగులు చేసే ఉద్యోగానికి పరిహార జీతం, ప్రయోజనాలు, ఆరోగ్య బీమా, కుటుంబ సెలవులు ఇస్తున్నారా? అని సెర్చ్ చేశారు.

    మొత్తంగా ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయాలని నిర్ణయించుకుంటున్నట్లు తేలింది. ఇలాంటి సమయంలో కంపెనీలు ఉద్యోగులను కచ్చితంగా కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తే వారు ఇతర ఉద్యోగాలను వెతికే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలు ఏ కొంచెం ఒత్తిడి ఉన్నా.. తమ ఉద్యోగాన్ని నిరభ్యరంతరంగా మానేసి మంచి ప్రయోజనాలనున్న జాబ్ ను వెతుకుతున్నారు.

    అయితే కొన్ని కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీలకు నష్టం చేకూరే అవకాశం ఉందని అంటున్నారు. కార్యాలయాల్లో పనిచేయడం వల్ల ఉద్యోగులకు ప్రాధాన్యత విలువలు పెరుగుతాయని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, యాజమాన్య ఆలోచనలు విభిన్నంగా ఉండి కంపెనీల ప్రతిష్టతను దెబ్బతిస్తాయని CNBC మేక్ ఇటట్ భారత్ సేల్స్ హెడ్ శశికుమార్ తెలిపారు. మరో విషయమేంటంటే రిమోట్ వర్క్ వల్ల ఉద్యోగుల్లో ఆసక్తి తక్కువగా ఉంటుందని అన్నారు.