Homeక్రీడలుRahul Dravid: ఆసియా కప్ ముందర టీమిండియాకు షాక్.. వైదొలిగిన కోచ్ రాహుల్ ద్రావిడ్.. లక్ష్మణ్...

Rahul Dravid: ఆసియా కప్ ముందర టీమిండియాకు షాక్.. వైదొలిగిన కోచ్ రాహుల్ ద్రావిడ్.. లక్ష్మణ్ కు బాధ్యతలు.?

Rahul Dravid: కీలకమైన ఆసియా కప్ ముందర.. అదీ శత్రుదేశం పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ కు సిద్ధమవుతున్న వేళ టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం అందరికీ షాక్ కు గురిచేసింది.

Rahul Dravid
Rahul Dravid

ప్రపంచకప్ టీ20లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. తొలిసారి ప్రపంచకప్ వేదికల్లో ఈ ఓటమిని సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే ఈసారి గెలుపు పక్కా అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు, మంచి ఆటగాళ్లతో టీం పటిష్టంగా తయారైంది. యువకులకు ఛాన్సులు ఇస్తూ అందరినీ పరీక్షిస్తూ బలమైన టీంగా టీమిండియాను ద్రావిడ్ తీర్చిదిద్దుతున్నాడు.

Also Read: Pooja Hegde: పాపం పూజ హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా తయారు అయ్యింది ఏంటి! ఆమె పని అయిపోయినట్టేనా?

ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉండగా.. అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. వచ్చే ఆదివారం యూఏఈలో పాకిస్తాన్ తో కీలకమైన ఆసియాకప్ మ్యాచ్ కు భారత్ సిద్ధమవుతున్న వేళ టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వస్తోంది. ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ప్రధాన కోచ్ లేకుండానే టీమిండియా యూఈఏలో వెళ్లాల్సి వస్తోంది.

Rahul Dravid
Rahul Dravid

యూఏఈకి వెళ్లేముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్కు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకొని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ స్థానంలో కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లారు. ద్రావిడ్ తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలోనే ఆసియా కప్ కు కూడా కోచ్ గా లక్ష్మణ్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ టీమిండియాకు కోచ్ గా చేపట్టనున్నారు.

Also Read:Raghu Rama Krishnam Raju Survey: మరో లగడపాటిలా రఘురామరాజు..ఏపీలో యాప్ సర్వే..

 

బాలీవుడ్ లో రచ్చ చేస్తున్న కార్తికేయ 2 | Nikhil Karthikeya 2 Shocking Collections In Bollywood

 

చిరు కెరీర్ లోనే తెలియని సంచలన నిజాలు | Sensational Facts On Chiranjeevi Career | #HBDChiranjeevi

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version