Suryakumar Yadav: పిచ్ ఏదైనా రెచ్చిపోతాడు. దేశమేదైనా బాదుడే బాదుడు. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరదే. అతడే సూర్యకుమార్ యాదవ్. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. తనదైన శైలిలో బ్యాట్ ను ఝుళిపిస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుంటాడు. బాల్ ఏదైనా సిక్సులు, ఫోర్ లు బాదుతాడు. దీంతో బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అతడిని ఔట్ చేసేందుకు బౌలర్లు నానా తంటాలు పడుతుంటారు. 360 డిగ్రీల ఆటగాడిగా పేరు సంపాదించాడు. టీమిండియాలో ప్రస్తుతం నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో అతడే మేటి.

ఆదివారం న్యూజిలాండ్, ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. పరుగుల వర్షం కురిపించాడు. ప్రతి బాల్ ను అతడు ఎదుర్కొన్న తీరు అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 సాధించి ఔరా అనిపించుకున్నాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి బౌలర్లను బెంబేలెత్తించాడు. న్యూజిలాండ్ ను చిత్తు చేయడంలో సూర్య పాత్ర ఎంతో ఉంది. దీంతో ప్రేక్షకులు సూర్య ఆటను చూసి ఫిదా అయ్యారు.
మ్యాచ్ అమెజాన్ ప్రైమ్ లోనే ప్రసారం కావడంతో ప్రేక్షకులు సూర్యకుమార్ ఆటను చూడలేకపోయారు. సూర్య ఇన్నింగ్స్ ను మిస్సయ్యారు. ఎంజాయ్ చేయలేకపోయారు. దీంతో వీడియోను అమెజాన్ ప్రైమ్, బీటీ స్పోర్ట్స్ యూ ట్యూబ్ ల్లో ప్రసారం చేశాయి. దీంతో సూర్య ఆటతీరును చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బాల్ అయినా సూర్య ఎదుర్కోవడాన్ని చూసి అందరు సంబరపడ్డారు. సూర్య ప్రతాపాన్ని చూసి ఈలలు వేశారు. ఒక్కో బంతిని ఒక్కో స్టైల్ లో బాదడం అతడి ప్రత్యేకత.

కివీస్ ను కట్టడి చేసి టీమిండియా విజయం సాధించింది. 2-0 పాయింట్లు సాధించింది. మొదటి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా రెండో మ్యాచ్ లో కివీస్ ను ఇండియా ఓడించి ముందంజలో నిలిచింది. ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ నేషియర్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇందులో కూడా సూర్య మెరుపులు సాధిస్తే విజయం ఖాయమే. దీంతో సూర్యకుమార్ ఆట తీరు కోసమైనా అభిమానులు మ్యాచ్ చూడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆఖరి మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో అనేది వేచి చూడాల్సిందే.