
India vs Australia 3rd Test : బోర్డర్, గవస్కార్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో.. భారత్ రెండో ఇన్సింగ్‌లో 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఛటేశ్వర్ పుజారా 59 పరుగులతో నాట్ భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాదన్ లయాన్ 8 వికెట్లు తీసి భారత బ్యాటర్లను వణికించాడు. ఇక ఇండియా ఆస్ట్రేలియా ఎదుట 75 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
కళ్లు చెదిరే క్యాచ్
ఇక రెండో రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాడు ఖవాజా పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. స్టార్క్ బౌలింగ్‌లో వేసిన షార్ట్‌పిచ్ బాల్‌ను అయ్యర్ బ్యాట్‌తో హుక్ చేశాడు. దీంతో బంతి నేరుగా గాలిలోకి లేచింది. ఈక్రమంలో ఖవాజా ఆ బంతిని నేరుగా గాలిలోకి స్పైడర్ మ్యాన్‌లా ఎగిరి అందుకున్నాడు. వాస్తవానికి ఆ బంతిని అందుకోలేడని అయ్యర్ అనుకున్నాడు. కానీ ఖవాజా అందుకున్న తీరు చూసిన తర్వాత నిరాశగా వెనుదిరిగాడు.
మ్యాచ్ స్వరూపం మారింది
ఇక ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి దాకా అయ్యర్, ఛటేశ్వర్ పుజరా క్రీజులో ఉన్నారు. నిదానంగా ఆడుతూ స్కోర్ బోర్డును మెల్లిగా కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ బౌలర్లను కాచుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. అయితే ఈక్రమంలో స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అయ్యర్ హుక్ చేయడంతో గాలిలోకి లేచింది. దీంతో దాన్ని అమాంతం గాలిలోకి ఎగిరిన ఖవాజా అందుకున్నాడు. అయ్యర్ ఔట్ అయిన తర్వాత ఇండియా స్కోరు బోర్డు మరింత నెమ్మదించింది. వచ్చిన బ్యాటర్లు ఎవరూ సహకరించకపోవడంతో పుజారా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. పుజారా కనుక నిలబడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కాగా ఖవాజా పట్టిన క్యాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఖవాజా క్యాచ్ అందుకున్న విధానం చూసిన నెటిజన్లు ” ఔరా.. ఖవాజా నీ ఒంట్లో ఎముకలున్నాయా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు
A stunner by Usman Khawaja. pic.twitter.com/qRGSzHd5ii
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2023