India vs New Zealand: భారత జట్టు 306 పరుగులు చేసినప్పుడు.. కివీస్ 35 పరులకే మొదటి వికెట్ కోల్పోయినప్పుడు.. 68 పరుగులకు రెండో వికెట్ చేజార్చుకున్నప్పుడు.. 88 పరుగులకు మూడో వికెట్ నష్టపోయినప్పుడు.. అందరూ కూడా భారత్ గెలుస్తుంది అనుకున్నారు.. కానీ అప్పుడు వచ్చాడు టామ్ బోథమ్.. కెప్టెన్ విలియమ్స్ కు తోడయ్యాడు. అగ్నికి,అజ్యానికి జోడి కుదిరినట్టు.. ఇద్దరు కూడా
చెలరేగిపోయి ఆడారు. నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 200 పై చిలుకు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి… 306 పరుగుల స్కోరును ఉఫ్ మని ఊదేశారు.

మొదటి మూడు వికెట్లు..
లక్ష్యసాధనకు దిగిన కివీస్ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ముఖ్యంగా కాశ్మీర్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ కిబిస్ బ్యాట్స్మెన్ గుండెల్లో దడ పుట్టించాడు. ఒకానొక దశలో మూడు వికెట్లకు 88 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఓటమి అంచుల్లో నిలిచింది. ఓవర్ కు నాలుగు పరుగులు రావడం కూడా కష్టమైంది. దశలో లాథమ్, విలియమ్స్ సమయోచితంగా ఆడారు. చెత్త బంతుల్ని బౌండరీ వైపు మళ్ళించారు. ఇదే దశలో విలియమ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లాథమ్ కూడా 50 పరుగులు చేసి… ఆ తర్వాత బ్యాట్ కు పని చెప్పాడు. వీరిద్దరిని విడదీసేందుకు శిఖర్ ధావన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.. బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఫలితం లేకుండా పోయింది.
మధ్యలో తేలిపోయారు
లక్ష్యసాధనకు దిగిన కివీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు..ముఖ్యంగా మాలిక్ నిప్పులు చెరిగే బంతులు వేశాడు. 20 ఓవర్ల దాకా బాగానే ఉన్న భారత్ బౌలింగ్.. ఆ తర్వాత లయ తప్పింది. దీంతో విలియమ్స్, లాథమ్ ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా లాథమ్ అయితే ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.. 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 145 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికే దక్కింది.

నిరాశపరచిన ఓపెనర్లు
భారత బ్యాటింగ్ ప్రారంభమైనప్పుడు ఓపెనర్లు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. కానీ కివిస్ జట్టు 35 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 68 పరుగుల వద్ద రెండో వికెట్, 88 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆదుకున్నారు. అదే దశలో భారత బ్యాట్స్మెన్ కూడా వరుసగా అవుట్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నిలబడి ఆడారు.. భారత బ్యాట్స్మెన్ ఇంకొక 50 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది.. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే న్యూజిలాండ్ మైదానాలు పూర్తి బ్యాటింగ్ పిచ్ లు గా మారిపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.