India vs Sri lanka: రోహిత్‌ను చూస్తుంటే నక్కతోక ఏమైనా తొక్కాడా అనిపిస్తోంది. ఎందుకంటే అతని కెప్టెన్సీలో ఆడిని అన్ని మ్యాచులు క్లీన్ స్వీప్ చేస్తున్నాడు. వరస సిరీస్ లను గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో రికార్డును ఖాతాలో వేసేసుకున్నాడు. బెంగుళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో కూడా తమకు తిరుగులేదని భారత్ నిరూపించుకుంది.

వాస్తవానికి రెండో రోజే ఆట గెలిచామని అర్థమైపోయినా.. ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తున్నామనేది మాత్రం ఆట ముగిసే సరికి అర్థమైపోయింది. రెండోరోజు ముగిసే సరికి 28 పరుగులతో ఒక వికెట్ కోల్పోయి ఉన్న శ్రీలంక.. మూడో రోజు ఆట ప్రారంభించింది. లంక కెప్టెన్ దిముత్ కరుణ రత్నె 104 పరుగులను 174 బంతుల్లో పూర్తి చేశాడు. మరో బ్యాట్స్ మెన్ కుశాల్ మొండిస్ 54పరుగులను 60బంతుల్లో పూర్తి చేశాడు.
వీరిద్దరూ ఇంతలా పోరాడినా.. ఇతర బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడంతో 208పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఇండియా నుంచి అశ్విన్ 4 వికెట్లు తీయగా, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లను తీశారు. ఇక రెండుసార్లు ఇండియా నుంచి గ్రేట్ ఇన్నింగ్స్ 92, 67 పరుగులు చేసిన శ్రీయాస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక అద్భుతమైన కీపింగ్ తో ఆకట్టుకున్న పంత్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. వాస్తవానికి కరుణ రత్నె, కుశాల్ బ్యాటింగ్ చూస్తే.. లంకేయులే గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అశ్విన్, బుమ్రాలు వారి వికెట్లను తీసి ఇండియాకు రిలీఫ్ ఇచ్చారు. తదనంతర వచ్చిన వారు ఎవ్వరూ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో ఇండియా గెలుపు సునాయాసం అయిపోయింది. టెస్టు సిరీస్‌కంటే ముందు ఇండియా టీ20 సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇలా రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో కీలక గెలుపులును సొంతం చేసుకుంటోంది ఇండియా. కోహ్లీని మించి రోహిత్ మసర్థుడని ఈ విజయాలు తేల్చేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో టీమిండియా మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టడం కామన్ అనే తెలుస్తోంది.