exercise : ప్రస్తుతం చాలా మంది జిమ్ కు వెళ్తున్నారు. వ్యాయామం చేస్తున్నారు. బలమైన, బరువైన శరీరాన్ని నిర్మించుకోవాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిమ్‌కు వెళ్లి వారి శరీర అవసరాలు, సామర్థ్యాలకు సరిపోని కఠినమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడు లేనంతగా ప్రస్తుతం యువతీ యువకులు గుండె పోటుతో మరణిస్తున్నారు.
భారతీయులు ఇతర దేశాల కంటే కనీసం 10 సంవత్సరాల ముందుగానే గుండె జబ్బులతో బాధపడుతున్నారు అని అధ్యయనాలు చెబుతున్నాయి. యువత, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. వ్యాయామం చేసే వారికి గుండెజబ్బులు ఉండవని అంటారు. కానీ ఇది పూర్తిగా తప్పట. వ్యాయామం వల్ల గుండెపోటు రాదంటే గత ఏడాది చాలా మంది నటులు చనిపోయే వారు కూడా కాదు కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత సంవత్సరం, నటుడు సిద్ధార్థ్ శుక్లా, హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ , నటుడు దీపేష్ భాన్ కూడా వ్యాయామం చేస్తూనే మరణించారు. ఈ వార్తల వల్ల జిమ్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందా? వ్యాయామశాలలో కఠినమైన శిక్షణ ఉంటుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. వ్యాయామశాలలో ఇచ్చే సప్లిమెంట్లు ప్రాణాంతకంగా ఉన్నాయి అనుకుంటున్నారు కొందరు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరకడం లేదు. నిజానికి గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం చాలా పెరుగుతుంది. ఇక జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల గురించి వైద్యులు వివరిస్తున్నారు. చాలా ఎక్కువ సేపు వ్యాయామం చేయడం లేదా రొటీన్ ను పట్టించుకోకుండా ఎక్కువ వ్యాయామం చేయడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె పోటు పెరుగుతుంది అంటున్నారు వైద్యులు. ప్రజలు కొన్ని నెలల వ్యవధిలో పదేపదే తమ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి. సప్లిమెంట్స్ ప్రజల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే చాలా మంది సప్లిమెంట్లను చెక్ చేసుకోకుండానే ఎక్కువగా తీసుకుంటారు.
జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డైట్ చార్ట్ పాటించాలి. ఆహారం వారి ఆరోగ్యానికి ప్రధానం. శరీరాన్ని జిమ్‌లో నిర్మించుకోవడం మాత్రమే కాదని డైట్ ద్వారా కూడా బాడీ బిల్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇక ఆహారాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలని, కానీ తక్కువ తక్కువ మొత్తంలో తినాలి అని సూచిస్తున్నారు.
ఇక ప్రతి ఒక్కరూ వర్కౌట్‌లు చేయాలి కానీ శరీరాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే చేయాలి. శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకూడదు. ఇక దేవంలో జిమ్ ల వ్యాపారం పెరిగింది. దీని వల్ల సరైన ట్రైనర్ లను నియమించుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ జిమ్‌లో శిక్షణ ఇవ్వడం కూడా లేదు. అందుకే ముందే జిమ్ లో మీకు ట్రైనర్ ఉంటారా? లేదా? ఆ జిమ్ సర్టిఫైడా కాదా అనే వివరాలు తెలుసుకొని మీ ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె పోటును తగ్గించుకునే అవకాశం ఉంది.