Inbreeding Death Warning: బ్రీడింగ్… ఇన్ బ్రీడింగ్.. ఇవి తరచు వినే పదాలు. కానీ వీటి గురించి లోతుగా చాలామందికి తెలియదు. ఇవేవో జంతువులకు సబంధించిన పదాలు అనుకుంటారు. మనకూ ఇది వర్తిస్తుంది. కానీ ఈ పదాలను తక్కువగా వాడతాం. మనకు ఎందుకు వర్తిస్తుందటే.. మనమూ కోతినుంచి వచ్చివారిమే కదా. ఇక ఈ పదాలను గురించి తెలుసుకుందాం.. బ్రీడింగ్ అంటే సంతానోత్పత్తి కోసం ఒక ఆడ, ఒక మగ లైంగికంగా కలవడం ద్వారా నూతన జీవకి జన్మ ఇవ్వడం. ఇన్‌బ్రీడింగ్ అంటే.. ఒకే రక్తసంబంధీకులు, అంటే మేనత్త, మేనమామ, చిన్నమ్మ, చిన్ననాన్న ఇలా రక్తసంబంధీకుల లైంగిక కలయిక ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. ఇప్పుడు వీటి గురించి ఎందుకంటే.. శాస్త్ర సాంతికేక పరిజ్ఞానం ఎంత పెరుగుతున్నా… ఇన్‌బ్రీడింగ్ ఆగడం లేదు. ప్రమాదకమని తెలిసినా కొంతమంది జంతువుల్లో ఇన్‌బ్రీడింగ్ ద్వారానే పిల్లలను కంటాయి కదా అని వితండ వాదం చేస్తున్నారు. అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత ఇన్ బ్రీడింగ్ సురక్షితమో.. ప్రమాదకరమో మీరే నిర్ణయించుకోండి.

ఇన్‌బ్రీడింగ్ మానవత్వంమీద ఏర్పడుతున్న ఉపద్రవంగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇన్‌బ్రీడింగ్‌లో పుట్టేవారిలో అంగవైకల్యం, త్వరగా మరణం సంభవించడం, దీర్ఘకాలిక, వంవపారపర్య వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. అందుకే దీనిని దీనిని చైనా, తైవాన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఇన్‌బ్రీడింగ్‌ను నిషేధించాయి. ఇన్‌బ్రీడింగ్‌లో డెత్ వార్నింగ్‌గా ఎందుకు మారిందో ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
దిహౌస్ ఆఫ్ హబ్స్‌బర్గ్..
దిహౌస్ ఆఫ్ హబ్సబర్గ్ అంటే.. యూరోపియన్ రాయల్ ఫ్యామిలీలలో గొప్ప పేరున్న ఫ్యామిలీ. శతాబ్దాల క్రితం వీరు అనేయ యుద్దాలు గెలిచి స్పెయిన్ దాని చుట్టూ ఉన్న అనేక చిన్నచిన్న రాజ్యాలపై పట్టు సాధించారు. అయితే ఇంతపెద్ద సామ్రాజ్యం ఒక్క రోజులో మట్టికరిచిపోయింది. 1649, అక్టోబర్ 07న వీళ్ల నాశనం మొదలైంది. 44 ఏళ్ల స్పెయిల్ కింగ్ ఫిలిప్ ఫోర్బ్ తన బిడ్డవయసు (14 ఏళ్లు) ఉన్న తన మేన కోడలు మరియానాను పెళ్లి చేసున్నాడు. దీంతో ఇతని కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరియానా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత ఆమె చనిపోయింది. ఐదు గురు బిడ్డల్లో ఒక్క బిడ్డ మాత్రమే బతికింది. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ జీవితం కూడా ఏం బాగా లేదు. తనకొన బిడ్డకు కాదు.. ఒక రాక్షసుడికి జన్మనించిందని చరిత్రకారులు అంటుంటారు. ఎందుకంటే అత్యంత వైకల్యంతో ఉన్న వ్యక్తి. అతనెవరో కాదు కింగ్ చామ్స్–2 ఇతను ప్రసిద్ధ రాజుల్లో ఒకడిగా పేరుంది. కానీ ఇతడి ధైర్యంచూసి ఆ పేరు రాలేదు. అతని రాక్షసత్వంతో పేరు వచ్చింది. ఇతడు చిన్నతనంలోనే దవడ లోపం ఉంది. ఇతను చికెన్‌పాక్స్, స్మాల్‌పాక్స్‌తోపాటు అనేక వ్యాధులను ఎదుర్కొన్నాడు. సరిగా మాట్లాడడం కూడా రాదు. 8 ఏళ్ల వరకు నడడానికి కూడా ఇబ్బంది పడేవాడు. 35 ఏళ్ల వయసులోనే చనిపోయాడు.
మరణానంతరం రహస్యం వెలుగులోకి..
చామ్స్–2 జీవితం 35 ఏళ్ల వరకు అంతా బాగనే అనిపించింది. కానీ అతని మరణానంతరమే భయంకరమైన రహస్యం బయటపడింది. అతని శరీరంలో ఒక్క రక్తం చుక్క కూడా లేదు. అతని గుండె మిరియపు గింజ జైజులో ఉంది. అతడి ఊపిరితిత్తులు కరిగిపోయాయి. రెండు టెస్టిస్కల్వ్‌లలో ఒక్కటి మాత్రమే ఉంది. అంది కూడా బొగ్గులా మారింది. ఇతనికి ఉన్న అనారోగ్య సమస్యలతో పెళ్లి చేసుకోలేదు. దీంతో అతడి వంశం అంతనితోనే ఆగిపోయింది. ఇన్‌బ్రీడింగ్ వల్ల మనిషి శరీరం ఎంత దారుణంగా మారుతుందో అనడానికి కింగ్ చామ్స్–2 ఒక ఉదాహరణం. ఇలా మారడానికి కారణాలను కూడా విశ్లేషిద్దాం.
– మన డీఎన్‌ఏ మన తల్లిదండ్రులింద్దరి డీఎన్‌ఏలో సగం సగం కలిపి తయారవుతుంది. మన డీఎన్‌ఏ లక్షణాలు, ఇతర జీవుల లక్షణాలకంటే డామినేటింగ్‌గా ఉంటాయి. బ్లూ ఐస్ కంటే బ్రౌన్ ఐస్ డామినేటింగ్ ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరికి బ్లూ జీన్స్, ఒకరికి బ్రౌన్ జీన్స్ ఉంటే వీరికి నాలుగు పేయిరింగ్ పాజిబులిటీస్ ఉంటాయి.
1. బ్రౌన్ – బ్లూ
2. బ్రౌన్ – బ్రౌన్,
3. బ్లూ– బ్లూ
4. బ్లూ– బ్రౌన్
బ్లూ–బ్రౌన్, బ్రౌన్–బ్లూ జీన్స్ మధ్య సంయోగం జరిగితే పుట్టే బిడ్డ కళ్లు బ్రౌన్‌గా ఉంటాయి. డాక్టర్లు చెప్పే ప్రకారం వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు రెసిష్యూ జీన్స్ ద్వారానే వస్తాయి. తల్లిదండ్రులిద్దరిలో రెసిష్యూ జీన్స్ ఉంటే బిడ్డకు అవి వచ్చే అవకాశాలు 50 శాతం ఉంటాయి. అవి వస్తే బడ్డ వైకల్యంతో పుడతాడు. లేదా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ కారణమే హబ్స్‌బర్గ్ వంశాన్ని ముందుకు పోనివ్వలేదు. అలాగే చరిత్రలో మంచిపేరు ఉండేలా కూడా చేయలేదు. ఇలాంటి ఫ్యామిలీలు జపాన్, కొరియా, చైనా, ఈజిప్ట్‌లో ఇన్‌బ్రీడింగ్ కామన్‌గా ఉండేవి. అందుకే ఆయా దేశాల్లో చిన్నవయసులోనే మరణాలు, వైకల్యాలతో జన్మించడం ఎక్కువగా జరిగేవి.
ఈజిప్టులో రాజు టొటెకమాన్‌ను తీసుకుంటే అతను కేవలం 19 ఏళ్లలోనే చనిపోయాడు. అతని మరణం సమయంలో ఎలాంటి అనుమానం రాలేదు. 1922లో ఇసుకను స్టడీ చేస్తుండగా టొటెకమాన్ మమ్మీ దొరికింది. దీని ఆధారంగా అతని మరణ రహస్యాన్ని సైంటిస్టులు బయటపెట్టారు. టొటెకమాన్ 9 ఏళ్ల వయసులో అతని తండ్రి చనిపోయాడు. తర్వాత రాజుగా పీటం ఎక్కాడు. తర్వాత అనేక రాజ్యాలను జయించాడు. ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. కానీ 19 ఏళ్లకే చనిపోయాడు. మమ్మీ ఆధారంగా ఇన్‌బ్రీడింగ్‌కు సంబంధించి అనేక రహస్యాలు బయటపడ్డాయి. అతని తల ఆకారం విచిత్రంగా ఉంది. ముక్కు సన్నగా, పెదాలు లావుగా, ఛాతీ ముందుకు వచ్చి ఉంది. మామూలుగా చెప్పాలంటే అతని శరీరం అమ్మాయిలా ఉంది. అతని స్కల్వ్‌లో డీజనరేట్ డిసీజ్ ఉంది. అతి క్రమంగా అతడి కాలును తినేసింది. అందుకే కాలులో ఎముక లేదు. క్రమంగా ఇమ్యూన్ సిస్టం బలహీనపడి టొటెకమాన్ మరణించాడు. ఈజిప్టులో అన్ని రాయల్‌ఫ్యామిలీలలో ఇన్‌బ్రీడింగ్ ఉంది. అందుకు కారణం రాజ్యాధికారం తమవద్దే ఉండాలనే ఆకాంక్ష. సరే అప్పుడు అలా జరిగిందంటే కారణం ఉంది. కాని సైన్స్ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా ఇన్‌బ్రీడింగ్ జరగడం ప్రమాదానికి సూచికగా భావిస్తున్నారు. 2008లో నార్త్ ఈస్ట్ చైనాలో ఒక ఫ్యామిలీ తమ పిల్లలకు పెళ్లి సంబంధం కుదరకపోవడంతో తల్లిదండ్రలు వారిద్దరికీ పెళ్లి చేశారు. కొన్నేళ్లకు ఐదుగురు పిల్లలు పుట్టారు. అందరూ మెంటల్లీ రిటార్టెడ్. కారణం ఇన్‌బ్రీడింగ్. యూకె సైంటిస్టుల ముందుకు ఎక్స్‌ట్రీమ్ ఇన్‌బ్రీడింగ్‌కు చెందిన 125 కేసులు వచ్చాయి. అక్కడ ప్రతీ 3 వేల మందిలో ఒకరు ఇన్‌బ్రీడింగ్ వలన పుట్టినట్లు తెలిసింది. కొద్ది రోజులకే వారు రెడ్యూస్డ్ లంగ్ ఫంక్షన్, రెడ్యూస్డ్ çఫెర్టిలిటీ వంటి వ్యాధులతో చనిపోయారు. ఇంత జరుగుతున్నా కొంతమంది డాక్టర్లు ఇన్‌బ్రీడింగ్‌లో లాభాలు ఉన్నట్లు అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దీనిని నిరూపించే ఆధారాలు మాత్రం లేవు. కాబట్టి ఇన్‌బ్రీడింగ్‌లో వినాశనం తప్ప లాభం ఏదీ లేదనేతి చరిత్రను బట్టి తెలుస్తుంది.