Janasena Convoy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి ప్రజల మధ్యకు రానున్నారు. కీలక యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆయన పర్యటన కొనసాగనుంది. అందుకే ఆయన తన పెండింగ్ సినిమాలు పూర్తి చేయడంపై ద్రుష్టిపెట్టారు. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తిచేసి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. యాత్రకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తిచేస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకుంటన్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో జనసేన నాయకులు ఉన్నారు. ఆయన యాత్ర తిరుపతి నుంచి ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. పవన్ తిరుపతి నురంచి పోటీచేస్తారన్న ఊహాగానాలతో పాటు తమ కుటుంబానికి సెంటిమెంట్ గా ఉన్న వేంకటేశ్వరుడి సన్నిధి అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా అన్ని లెక్కల తరువాత ఆయన తిరుపతి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.అయితే దీనిపై తుది నిర్ణయమంటూ ఏదీ ఇంకా వెలువడలేదు. కొద్దిరోజుల్లో కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది. కానీ అంతకంటే ముందుగానే యాత్రకు సంబంధంచి షరంజామా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు పవన్. ప్రధానంగా కాన్వాయ్ ను సమకూర్చుకుంటున్నారు. కొత్త కాన్వాయన్ ను సిద్ధం చేసుకున్నారు. ఇందుకుగాను కొత్త స్కార్పియోలను కొనుగోలు చేశారు.ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఒక్కో కారు విలువ దాదాపుగా 19 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. అధినేత ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా పవన్ ను సీఎం చేస్తామనే షరతుకు ఓకే చెబితే మాత్రమే పవన్ టీడీపీకి సపోర్ట్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

జీర్ణించుకోలేని పేటీఎం బ్యాచ్
అయితే పవన్ ప్రైవేటు కాన్వాయ్ ఏర్పాటు చేయడాన్ని కూడా అధికార వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. కాన్వాయ్ పైనా రాజకీయ విమర్శలు తగ్గడం లేదు.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుంటామని ఇచ్చిన హామీతో.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే పవన్ ఈ కాన్వాయ్ ను కొన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో తనకు పార్టీని నడిపించడానికి డబ్బులు లేవని చెప్పిన పవన్.. ఒకేసారి ఇన్ని వాహనాలు ఎలా కొన్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే దానికి ధీటుగానే జనసైనికులు సమాధానం చెబుతున్నారు.. తమ అధినేత ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ లో ఇలాంటివి ఎన్నైనా కొనొచ్చని గుర్తు చేస్తున్నారు. అవినీతిలో పుట్టిన పార్టీ మీది.. మీరా మా అధినేతపై విమర్శలు చేసేది అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఆకాశం పై ఉమ్ము వేయాలని ప్రయత్నిస్తే అది మీ ముఖానికి వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నారు.
బాధలో అభిమానులు
మరోవైపు పవన్ సినిమాలకు దూరమవుతుండడంతో అభిమానులు బాధపడుతున్నారు. ఇది మెగా పవర్ అభిమానులకు నిరుత్సాహం కలిగించే వార్త అయినా.. ఆయన రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకే నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం వారు స్వాగతిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం మీద ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆ సినిమాలన్నీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే దసరా లోపు తన పార్టు వరకు షూటింగ్ పూర్తి చేయాలని..పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైనా పరవాలేదని నిర్మాత, దర్శకులకు చెప్పినట్టు టాక్.. ఎందుకంటే ఇకపై ఆయన పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు వెళితే మళ్లీ సినిమాలు చేయడం అంత సులువు కాదు.. ఈ దసరా నుంచి మళ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు షూటింగ్ లకు గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.
ఆ సినిమాలు పూర్తిచేసే పనిలో..

గత కొన్నేళ్లుగా పవన్ కు విపరీతమై స్టార్ డమ్ పెరిగిపోయింది. రాజకీయాల్లో ఉండడం వల్ల మంచి మైలేజ్ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా పవన్ కలెక్షన్లను కొల్లగొడుతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత అతి తక్కువ కాలంలో సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది పూర్తయిన వెంటనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని తొందర పెడుతున్నారని టాక్.ముఖ్యంగా భవదీయుడు భగత్ సింగ్ తర్వాత పూర్తిగా ఆయన బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం కోసం బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ జనసేన గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని పవన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.