Bhagini Hastha Bhojanam: భారతదేశంలో ఎన్నో పురాణాలు దాగి ఉన్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని పురాణాలు బంధాలు, బాంధవ్యాలు తెలియజేస్తాయి. దీపావళి సందర్భంగా ‘భగిని హస్త భోజనం’ అనేది వింటుంటాం. కొందరు ఈ పదం వినగానే పెద్దగా పట్టించుకోరు. చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఇంట్రెస్ట్ పెడుతారు. భగిని హస్త భోజనం అన్నా చెల్లెల్ల మధ్య అనుబంధాన్ని తెలుపుతుంది. సాధారణగా అన్నా చెల్లెల్ల అనుబంధ వేడుక రాఖీ గురించి మాట్లాడుకుంటారు. కానీ భగినిహస్తం ఎందుకు అనే సందేహం వస్తుంది. మరి ఆ వివరాలు తెలుసుకోవాలంటే?
భగిని అంటే చెల్లెలు.. హస్తం అంటే చేయి.. భోజనం అంటే భోజనమే.. అంటే చెల్లెలు వండిన వంటను అన్న భోజనం చేయడం. నేటి కాలంలో పెళ్లయ్యేవరకు అన్నాచెల్లెళ్లు ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ తరవాత దూరమై ఎక్కోడో జీవిస్తూ అప్పుడప్పుడు కలుస్తున్నారు. అలాగే పూర్వకాలంలో కూడా యముడు తన విధుల్లో బిజీ అయి ఉండి.. తన చెల్లెలు యమునను చూడడానికి వెళ్లేవారు కాదు. దీంతో తన అన్న ఇంటికి వచ్చి ఎప్పుడు భోజనం చేస్తాడోనని ఎదరుచూస్తుంది.
ఈ తరుణంలో యముడు మార్కండేయ ప్రాణాలు తీయడానికి వస్తాడు. మార్కండేయ శివుడికి పరమవీర భక్తుడు. యముడు రాగానే మార్కండేయ శివుడిని వేడుకుంటాడు. తన ప్రాణం తీయొద్దని వేడుకుంటాడు. అయినా తన విధుల్లో భాగంగామార్కండేయ ప్రాణాలు తీయడానికి ముందకు వస్తాడు. ఈ క్రమంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. మార్కండేయ తన భక్తుడని, తన ప్రాణాలు తీయొద్దని శివుడు అంటాడు. కానీ తనకు పేద, ధనిక, భక్తులు, నాస్తికులు అని తేడా లేదని, అర్దాయుష్సు కలిగిన మార్కండేయ ప్రాణాలు తీయాలని అంటాడు. తన మాట వినకపోవడంతో యముడిపై శివుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
ఆ తరువాత తన శూలాన్ని యముడిపై విసిరేస్తాడు. ఆ శూలం నుంచి తప్పించుకునేందుకు యముడు పరుగెత్తుతాడు. అలా పరుగెత్తుకుంటూ తన చెల్లెలు యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అయితే ఎంతో కాలం తరువాత తన అన్న ఇంటికి వచ్చాడని యమున సోదరుడు యముడిని సాదరంగా ఆహ్వానిస్తుంది. రుచికరమైన వంటలు వండి వడ్డిస్తుంది. చెల్లెలు చేసిన మర్యాద, వండిన వంటలకు ముగ్ధడైపోతాడు. దీంతో ఏదైనా వరం కోరుకోవాలని యమునను కోరుతాడు.
ఈ రోజున ఎవరైతే సోదరుడు తన చెల్లిలి ఇంట్లో భోజనం చేస్తారో.. ఆ అన్నకు భయాలు పొగోట్టాలని కోరుతుంది. తథాస్తు అంటూ యముడు దీవిస్తాడు. దీంతో అప్పటి నుంచి దీపావలి వెళ్లిన రెండు రోజులకు.. కార్తీక మాసం రెండో రోజున భగిని హస్త భోజనం చేస్తారు. ఈ విషయం తెలిసిన ప్రతీ సోదరుడు తన చెల్లెలు ఇంటికి వెళ్లి, తాను ఎలా జీవిస్తుందో తెలుసుంటారు. అలాగే చెల్లెలి చేత వండిన వంటలు తిరి మరిసిపోతారు.