watching TV : నాటి కాలంలో వార్తాపత్రికలు కూడా పరిమిత స్థాయిలోనే ఉండేవి. ఆకాశవాణి లో వార్తలు ప్రసారం అయ్యేవి కాబట్టి.. జనాలకు సమాచారం తెలిసేది. నాటి రోజుల్లో టీవీలకు అతుక్కుపోవడం.. అదేపనిగా స్మార్ట్ ఫోన్ చూడటం ఉండేది కాదు. పైగా ప్రజలకు శారీరక శ్రమ ఉండేది. అందువల్ల వారికి ఎటువంటి రుగ్మతలు ఉండేవి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల మధ్య అ నిత్య సంభాషణలు కొనసాగుతుండేవి. గ్రామంలో ఉన్న రచ్చబండ మీదనో.. ఇంటి అరుగుల మీదనో కూర్చుని మాట్లాడుకునేవారు. హరికథలు, బుర్రకథలు వినేవారు. పండుగలప్పుడు మాత్రమే సినిమాలకు వెళ్లేవారు. ఇలా వారి జీవితం ఉండేది కాబట్టే.. 8 పదుల దాకా జీవించగలిగారు. కొందరైతే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజుల్లో అలా లేదు. ఇకపై అలా ఉండదు.
అదే పనిగా చూస్తే..
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ వాడకం అనేది నిత్యకృత్యం అయిపోయింది. అది లేకుండా క్షణం కూడా జీవితం సాగని పరిస్థితి నెలకొంది. మాట నుంచి ఆట వరకు.. పాట నుంచి చెల్లింపుల వరకు ప్రతిదీ సెల్ఫోన్ ద్వారానే జరుగుతోంది. అందువల్ల ప్రజలు స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. లేనిపోని రుగ్మతలను తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా ఓ అధ్యయనం ప్రకారం టీవీ చూడటం కూడా అంత మంచిది కాదట. టీవీ ని అదేపనిగా చూస్తే జీవితకాలం తగ్గిపోతుందట. ఒక గంట సేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.. ఒక అధ్యయనం ప్రకారం టీవీ చూడని వారితో పోల్చి చూస్తే టీవీ చూసినవాళ్లు ఐదు సంవత్సరాలు తక్కువగా జీవిస్తారట. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర స్క్రీన్ లను చూడడం తగ్గించుకోవాలని హితవు పలుకుతున్నారు. శారీరకంగా శ్రమ ఉండే పనులను చేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు..” స్మార్ట్ కాలంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. కాకపోతే అదేపనిగా టీవీలు చూడడం పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ లో గంటలు గంటలు కాలక్షేపం చేయడం ఎక్కువ అవుతోంది. అందువల్లే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే.. శారీరక శ్రమను అలవర్చుకోవాలి. ముఖ్యంగా స్మార్ట్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. దానివల్ల నేత్ర సంబంధిత వ్యాధులు దరి చేరవని” వైద్యులు సూచిస్తున్నారు.. పరిధి మేరకే టీవీలు చూడాలని, స్థాయి దాటితే వాటి ప్రభావం నేత్రాల మీద పడుతుందని.. అందువల్ల ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలు ధరించి టీవీలు చూడాలని వివరిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం వివిధ వేదికల వద్ద పరిశీలించి కథనంగా రూపొందించాం. ఇది వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.