Wearing Glasses: నేటి కాలంలో, స్క్రీన్ సమయం చాలా పెరిగింది. సగం కంటే ఎక్కువ మంది అద్దాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈ అద్దాలు తమ కళ్ళ అందాన్ని దాచిపెడతాయని అమ్మాయిలు ఫీల్ అవుతుంటారు కదా. ఇలా అద్దాలు పెట్టుకునే వారు మేకప్ వేసుకున్నా సరే అంత అందంగా ఏం కనిపించరు. మేకప్ సరిగ్గా వారికి సూట్ కాదు అనే భ్రమ ఉంటుంది. అందుకే అద్దాలు ఉన్నా సరే మా అందాన్ని ఎలా కాపాడుకోవాలంటే యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ కూడా చూస్తుంటారు కొందరు. అయినప్పటికీ వారు నిరాశ చెందుతారు.
మీ కంటి మేకప్ సరిగ్గా ఉంటే, అది మీ కళ్ళను హైలైట్ చేయడమే కాకుండా, మీ మొత్తం లుక్‌ను గ్లామరస్‌గా మారుస్తుంది. మీరు కూడా అద్దాలు ధరించి, కిల్లర్ లుక్ పొందాలనుకుంటే ఒకసారి ఈ ఆర్టికల్ చదివేసేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజు మేము మీకు అలాంటి మేకప్ చిట్కాలను చెప్పబోతున్నాము. వాటితో మీరు అద్దాలు ధరించినప్పటికీ స్మోకీ ఐస్ లుక్ పొందుతారు. ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందామా మరి..
వాల్యూమ్ ఉన్న మస్కారా
కళ్ళద్దాలు ధరించే అమ్మాయిలు కర్లింగ్ మస్కారాకు బదులుగా వాల్యూమ్ మస్కారా వాడాలి. ఇది కనురెప్పల వల్ల స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మీ కనురెప్పలు కూడా అందంగా కనిపిస్తాయి. మీరు దీన్ని మార్కెట్లో సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించండి.
సరైన ఫౌండేషన్ కొనండి
మీ చర్మ రంగు, రకాన్ని బట్టి ఫౌండేషన్ కొనండి. మీ చర్మం జిడ్డుగా ఉంటే మ్యాట్ ఫౌండేషన్ మంచిది. పొడి చర్మం ఉన్నవారికి, క్రీమ్ ఫౌండేషన్ మంచిది. దీన్ని ముఖానికి అప్లై చేసేటప్పుడు, అది బాగా కలిసిపోతుందని, అద్దాలు ధరించిన తర్వాత ఎటువంటి మచ్చలు కనిపించవని గుర్తుంచుకోండి. ఇది అద్దాలు పెట్టుకున్నా సరే మిమ్మల్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది.
కనుబొమ్మలపై శ్రద్ధ
మీ కంటి మేకప్ అందంగా కనిపించాలంటే, మీ ఐబ్రో మేకప్ కూడా బాగుండాలి. కళ్లద్దాలు ధరించే అమ్మాయిలు తమ ఐబ్రోలను హైలైట్ చేయడం చాలా ముఖ్యం. మీ ఐబ్రోలను మందంగా చేయడానికి మీరు జెల్, పౌడర్, ఐబ్రో పెన్సిల్ ఉపయోగించవచ్చు.
మస్కారా కూడా అవసరం
కాజల్ లేకుండా ఏ మేకప్ అయినా అసంపూర్ణంగా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి కాజల్ వేసుకోవాలని మనకు చెబుతారు. ఇది మీ కళ్ళను చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది మీ కళ్ళకు చాలా ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. మీ కళ్ళు అద్దాలు ధరించినా సరే మంచిగా కనిపించాలంటే పై కనురెప్పపై కాజల్ వేయండి. ఇది మీకు స్మోకీ లుక్ ఇస్తుంది. మీకు స్మోకీ కళ్ళు కావాలంటే బోల్డ్ షేడ్స్ ఉన్న ఐ షాడో వాడండి. ఇది మీ మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.