https://oktelugu.com/

మహా శివరాత్రి రోజు వీటిని సమర్పిస్తే శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది..

2024 సంవత్సరంలో మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం రానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ రోజున ఎంతో పవిత్రంగా ఉంటూ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటి నుంచే శివ మాలలు

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2024 / 03:49 PM IST

    mahashivarathri

    Follow us on

    భక్తులు అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా వరాలు ఇచ్చే దేవుడు శివుడు.. అందుకే ఆ మహాదేవుడిని భోళా శంకరుడిగా పిలుస్తారు.. పరమశివుడిని భక్తులు ప్రతిరోజూ పూజిస్తారు. కానీ మహాశివరాత్రి రోజున ఆ దేవదేవుడిన స్మరిస్తే జీవితం సంతోషమయంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 2024 సంవత్సరంలో మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం రానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ రోజున ఎంతో పవిత్రంగా ఉంటూ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటి నుంచే శివ మాలలు వేసి గరళా కంఠుడి స్మరణలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి రోజును శివునికి అతి ప్రీతి అయిన వీటిని సమర్పిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అంటున్నారు. ఇంతకీ ఆవేంటంటే?

    మహాశివుడు కంఠంలో విషాన్ని దాచుకుంటాడు. దీంతో ఆయన నిత్యం వేడితో ఉంటారు. ఆయనను చల్లబర్చడానికి శివాలయాల్లో నిత్యాభిషేకం చేస్తారు. అయితే దేవతలు ధాతురాన్ని సమర్పించి చల్లబర్చారని అంటారు. అందువల్ల మహా శివరాత్రి రోజున ధాతురంను సమర్పించి శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

    శివుడు అలంకారానికి దూరంగా ఉంటాడు. ప్రకృతిలో లభించే పూలు, పత్రాలే ఆయనకు ఇష్టం. వీటిలో బిల్వ పత్రాలు అంటే శివుడికి ఎంతో ఇష్టం. అందువల్ల మహా శివరాత్రి నాడు శివ పూజలో తప్పకుండా బిల్వ పత్రాలు ఉండేలా చూసుకోవాలి. బిల్వ పత్రాలతో శివపూజ చేయడం ఎంతో పరిపూర్ణం అని అంటారు.

    శివుడికి జలాభిషేకంతో పాటు క్షీరాభిషేకం చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు తేనె అభిషేకం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ప్రకృతిలో లభించే ఎలాంటి కల్తీ లేని తేనెను శివుడికి సమర్పిస్తే భక్తుల కోరికలు తీరుస్తాడని అంటున్నారు. అందువల్ల శివుడికి అభిషేకం చేయాలనుకుంటే తేనెను తప్పని సరిగి తెచ్చుకోండి.

    ఇంట్లో ఉన్న దోషం పోవడానికి చాలా మంది జిమ్మి మొక్కను ఇంట్లోకి తెచ్చుకుంటారు. జిమ్మిని శని దేవుడికి సమర్పించడం వల్ల దు:ఖాలు తొలగిపోతాయి. అయితే మహాశివరాత్రి రోజున జిమ్మి ఆకులతో అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం ఉటుంది. అలాగే కుంకుమ పువ్వును శివుడికి సమర్పిస్తే ఎంతో మంచిదని అంటారు. అందువల్ల మహా శివరాత్రి రోజు వీటిని శివుడికి ఇచ్చి శివానుగ్రహం పొందవచ్చు.